AP Jobs : ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ కడప జిల్లాలోని వైద్యారోగ్య అధికారి కార్యాలయం నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా 68 పోస్టులను ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికన భర్తీ చేయనున్నారు. కడప వైద్యారోగ్య అధికారి కార్యాలయం విడుదల చేసిన ఉద్యోగ ప్రకటన ప్రకారం.. మొత్తం 68 పోస్టుల్లో అత్యధికంగా 50 పోస్టులు జనరల్ డ్యూటీ అటెండెంట్‌కు చెందినవి. మరో 4 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు, 2 బార్బర్ పోస్టులు, 2 ధోబీ పోస్టులు, 4 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు, 6 ఓటీ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఈ జాబ్స్‌లో పోస్టులను అనుసరించి విద్యార్హతలు ఉన్నాయి. పదో తరగతి, డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా పాసైన వారు పోస్టును బట్టి అప్లై చేయొచ్చు. గతంలో పని చేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. అప్లై చేసే వారి వయసు 42 సంవత్సరాలకు మించకూడదు. ఎంపికైన వారికి శాలరీలు రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు ఉంటాయి. దరఖాస్తులను జనవరి 30న సాయంత్రం 5 గంటల లోగా ఆఫ్ లైన్‌లో సమర్పించాలి. దరఖాస్తులను ప్రిన్సిపాల్, ప్రభుత్వ మెడికల్ కాలేజీ, పుట్లం పల్లి, కడప, వైఎస్ఆర్ జిల్లా చిరునామాకు పంపించాలి. దరఖాస్తులను జనవరి 31 నుంచి ఫిబ్రవరి 8 వరకు పరిశీలిస్తారు. ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్‌ను ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తారు. ఇక ఫైనల్ లిస్ట్ ఫిబ్రవరి 16న విడుదల అవుతుంది. ఎంపికైన అభ్యర్థుల ఒరిజినల్ పత్రాల పరిశీలన ఫిబ్రవరి 19న జరుగుతుంది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://kadapa.ap.gov.in/ ను చూడొచ్చు.
We’re now on WhatsApp. Click to Join.
49 అంగన్‌వాడీ జాబ్స్
పాడేరు, రంపచోడవరం, చింతూరు డివిజన్ల పరిధిలో ఖాళీగా ఉన్న 49 అంగన్‌వాడీ పోస్టుల(AP Jobs) భర్తీకి చర్యలు చేపట్టారు. అంగన్ వాడీ కార్యకర్తలు, ఆయాలు, మినీ అంగన్‌వాడీ కార్యకర్తల ఖాళీ పోస్టుల భర్తీకి ఈనెల 26 నుంచి వచ్చేనెల 10వ తేదీ సాయంత్రం ఐదుగంటల వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళలు తప్పనిసరిగా టెన్త్ పాసై ఉండాలి. స్థానికంగా నివాసం ఉండే వివాహిత ఈ పోస్టుకు అర్హులు. 2023 జూలై ఒకటి నాటికి అభ్యర్థులు 21 ఏళ్లు నిండి, 35 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి. ఖాళీ పోస్టుల వివరాలు, దరఖాస్తు చేసుకునే విధానం, ఇతర అర్హతలకు సంబంధంచి స్థానికంగా ఉన్న ఐసీడీఎస్ కార్యాలయాల్లో సంప్రదించాలి.