Site icon HashtagU Telugu

Geetanjali Suicide Case : టీడీపీ కార్యకర్త పసుమర్తి రాంబాబు అరెస్ట్..

Geetanjali Suicide Case Pas

Geetanjali Suicide Case Pas

తెనాలికి చెందిన గీతాంజలి ఆత్మహత్య కేసు (Geetanjali Suicide Case)లో పోలీసులు TDP సోషల్ మీడియా కార్యకర్త పసుమర్తి రాంబాబు (Pasumarthi Rambabu )ను అరెస్టు (Arest) చేసారు. గీతాంజలి వైసీపీ (YCP) సర్కార్ కు జై కొట్టిందని చెప్పి కొంతమంది ఈమెపై విపరీతమైన నెగిటివ్ ట్రోల్స్ చేయడం తో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈమె మృతికి కారణం టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీలే అంటూ వైసీపీ ఆరోపిస్తుంటే..టీడీపీ మాత్రమే వైసీపీ పార్టీనే ఆమె మృతికి కారణం అంటుంది. ఇలా ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్య ఫై కేసు నమోదు చేసిన పోలీసులు..దర్యాప్తులో భాగంగా ఈరోజు TDP సోషల్ మీడియా కార్యకర్త పసుమర్తి రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ సింగ్ నగర్లో అరెస్టు చేసి, తెనాలి PSకు తరలిస్తున్నట్లు సమాచారం. అయితే నోటీసులు లేకుండా తనను పోలీసులు విచారణకు తీసుకెళ్తున్నారని రాంబాబు ఉ.6 గం.కు ట్వీట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ అరెస్ట్ ఫై వైసీపీ స్పందిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. గీతాంజలి ఆత్మహత్య కేసులో టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త, బోండ ఉమ అనుచరుడు పసుమర్తి రాంబాబు అరెస్ట్ అయ్యాడని.. విజయవాడ సింగ్ నగర్లో అతడిని తెనాలి పోలీసులు అరెస్ట్ చేసినట్లు వైసీపీ సోషల్ మీడియాలో ప్రకటించింది. ఈ సందర్భంగా.. గీతాంజలిపై అసభ్యకరంగా స్పందిస్తూ అతడు చేసిన పోస్టులు, బోండా ఉమతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది.

ఇదిలా ఉంటె ఈ ఘటన ఫై ఇప్పటికే సీఎం జగన్ స్పందిస్తూ.. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. గీతాంజలి కుటుంబాన్ని ఆదుకోవడానికి తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆమె కుటుంబానికి మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు. దానిలో భాగంగా గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షలు ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు సీఎం జగన్.

Read Also : Harry Brook: ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టుకు బిగ్ షాక్‌.. స్టార్ ఆట‌గాడు దూరం..!