Site icon HashtagU Telugu

Maoist Chalapathi : మావోయిస్ట్‌ కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి ఎన్‌కౌంటర్‌.. ఆయన నేపథ్యం ఇదీ

Maoist Chalapathi Encounter

Maoist Chalapathi : ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్‌ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 14 మంది మావోయిస్టులు చనిపోగా.. వారిలో కీలక మావోయిస్టు నేత చలపతి అలియాస్‌ రామచంద్రా రెడ్డి అలియాస్‌ జైరామ్‌ కూడా ఉన్నట్లు తెలిసింది. ఈయన ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు.  ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి చిత్తూరు జిల్లావాస్తవ్యులు. దాదాపు 27 ఏళ్ల క్రితం చలపతి మావోయిస్టులలో చేరారు. ఆయనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.కోటి రివార్డును ప్రకటించాయి. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా బార్డర్‌లోని కులరిఘాట్‌ అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. అక్కడ చనిపోయిన వారిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులైన మనోజ్‌, స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడు గుడ్డూ(Maoist Chalapathi) కూడా ఉన్నారని తెలిసింది.  14 మంది మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

Also Read :Vivek Ramaswamy : ట్రంప్‌ ‘డోజ్’ నుంచి వివేక్‌ ఔట్.. పెద్ద స్కెచ్‌తోనే ?

రూ.కోటి రివార్డు కలిగిన అగ్రనేత చలపతి 

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాలను ఆనుకొని ఉన్న దట్టమైన అడవులను అడ్డాగా చేసుకొని మావోయిస్టులు చాలా ఏళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆ అడవులను ఆనుకొని ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సరిహద్దులు ఉండటంతో మావోయిస్టుల రాకపోకలు కూడా సులభంగా జరిగేవి. అందుకే ఆ అడవుల్లోనే మావోయిస్టుల అగ్రనేతలు కూడా పాగా వేస్తుండేవారు. ఈ అంశంపై పక్కా సమాచారం అందినందు వల్లే తాజాగా ఒడిశా బార్డర్‌లోని గరియాబంద్‌ జిల్లాలో ఎన్‌కౌంటర్ చేశారు. రూ.కోటి రివార్డు కలిగిన మావోయిస్టు అగ్రనేత చలపతిని మట్టుబెట్టారు.  చలపతి ఇప్పటివరకు మావోయిస్టు కేంద్ర కమిటీలో కీలక పాత్ర పోషించారు. సైద్దాంతికంగా మావోయిస్టులు ఇప్పటివరకు బలంగా నిలవడానికి ప్రధాన కారకులైన అతికొద్ది మంది మావోయిస్టు అగ్రనేతల్లో చలపతి ఒకరు.  ఆయన ఎన్‌కౌంటర్‌ జరిగినందున.. రానున్న రోజుల్లో ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా సరిహద్దుల్లోని దండకారణ్యాలలో, ఆంధ్రా- ఒడిశా  సరిహద్దుల్లోని అడవుల్లో వ్యూహరచన పరంగా మావోయిస్టులు గడ్డుకాలాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.

Also Read :Boxoffice : బాహుబలి 2 రికార్డు ను బ్రేక్ చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’

మావోయిస్టు అగ్రనేత చలపతి గురించి..