ఇలాగే మాట్లాడుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు. మరికొద్ది రోజుల్లో ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. జగన్ వంటి బలమైన నేతను ఓడగొట్టాలంటే ఒక్కరి బలం సరిపోదు..ఇద్దరు కలవాలి..అవసరమైతే ముగ్గురు కలవాలి..అప్పుడే జగన్ ను గద్దె దించగలం..ఇది టీడీపీ – జనసేన – బిజెపి పార్టీలు మాట్లాడుకుంటూ వచ్చారు. వీరిలో ఇద్దరి బలం ఫిక్స్ కాగా,,మూడో బలం ఇంకా జతకట్టలేదు. ఇప్పుడు ఈ ఇద్దరి బలాల్లోనే విభేదాలు మొదలైనట్లు తెలుస్తుంది. టికెట్ల పంపకాలు ఈ ఇరు నేతల మధ్య విభేదాలకు కారణం కాబోతుందని స్పష్టంగా తెలుస్తుంది.
టీడీపీ – జనసేన లు జతకట్టి ఎన్నికల బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యాయి..దీనిపై ఇరు అధినేతలు చర్చలు జరిపారు. ఏది చేసిన కలిసే చేయాలనీ..కలిసే ముందుకు వెళ్లాలని చర్చించుకున్నారు. అదే విధంగా ప్లాన్ చేసారు. కానీ ఇంతలో చంద్రబాబు..తొందర పడి డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట, అరకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించేసారు.
పొత్తు ధర్మం పాటించకుండా టీడీపీ అరకు, మండపేట సీట్లకు అభ్యర్థులను ప్రకటించడం జనసేన శిబిరంలో అసంతృప్తిని రగిల్చింది. మండపేట జనసేన క్యాడర్ వచ్చి పవన్ ముందు అసంతృప్తిని వెళ్లగక్కింది. ఇకపైనా టీడీపీ ఇలాగే తమకు ఇష్టం వచ్చిన చోట్ల తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని జనసేనానిని హెచ్చరించారు. రా కదలిరా సభల్లోనూ చంద్రబాబు గుడివాడలో వెనిగళ్ల రామును, మరికొన్ని చోట్ల అలాగే ఆయా టీడీపీ నేతలను ఎమ్మెల్యేలుగా ఆశీర్వదించాలనే కోణంలో మాట్లాడారు. దీంతో పవన్ కళ్యాణ్ ముందస్తు జాగ్రత్తలకు ఉపక్రమించారు.
We’re now on WhatsApp. Click to Join.
టీడీపీ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాబట్టి, తాము కూడా ప్రత్యేక పరిస్థితులు రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని పవన్ కళ్యాణ్ అన్నాడు. ఇది కేవలం టీడీపీకి ఒక హెచ్చరికగానే చూడాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే అదే ప్రసంగంలో పవన కళ్యాణ్ కూటమి పైనా మాట్లాడారు. పొత్తు తెగిపోవాలంటే ఎంతసేపు? కానీ, తాము అది కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. పొత్తు అన్నాక ఎక్కవ తక్కువలు ఉంటాయనీ చెప్పుకొచ్చారు. అలాగే.. చాలా స్థానాల్లో జనసేనకు బలం పెరిగిందని, గతంలో కంటే ఈ సారి ఓటు శాతం గణనీయంగా పెరుగుతుందని, ఆ సంకేతాలు ఉన్నాయని పేర్కొన్నారు. తద్వార సీట్లను బార్గెయిన్ చేయడానికి ఓ ప్రాతిపదికను పవన్ కళ్యాణ్ ప్రస్తావించినట్టయింది.
పవన్ కళ్యాణ్ లేవనెత్తిన ఈ అంశం పట్ల వైసీపీ మరోవిధంగా ప్రచారం మొదలుపెట్టింది. నాలుగు రోజులు ఆగండి… టీడీపీ, జనసేన నేతలు రోడ్లపైకి వచ్చి కొట్టుకుంటారు అంటూ వారి స్టయిల్ లో మాటల యుద్ధం మొదలుపెట్టారు. ట్విట్టర్ వేదికగా వైసీపీ నేతలు వరుసపెట్టి పవన్ చేసిన కామెంట్స్ ఫై మాట్లాడుతూ..ప్రజలను మరింత అయోమయంలో పడేయడం..కూటమి చీలిపోతుందని ఇన్ డైరెక్ట్ గా చెప్పకనే చెప్పడం మొదలుపెట్టారు. ఏది ఏమైనప్పటికి పొత్తు అన్నప్పుడు అంత పొత్తులోనే జరగాలి కానీ ఇలా ఎవరికీ వారు అన్నట్లు నిర్ణయాలు తీసుకుంటూ , ప్రకటనలు చేస్తే ఇరు పార్టీలకే నష్టం అని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
Read Also : KCR: ఎర్రవెల్లి లో కేసీఆర్ సమావేశం, బీఆర్ఎస్ ఎంపీలకు దిశానిర్దేశం!