జనసేనాని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం వైజాగ్(Vizag) లో వారాహి యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖలో జరుగుతున్న అక్రమాలు, ప్రభుత్వ భూముల అమ్మకాలు, రుషికొండని నాశనం చేయడం.. ఇలా పలు అంశాలపై మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు పవన్ కళ్యాణ్. ఇక ఎప్పటిలాగే పవన్ మాట్లాడే మాటలకు వైసీపీనాయకులు కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా టీడీపీ(TDP) నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) పవన్ కి సపోర్ట్ గా మాట్లాడారు.
విశాఖలో చంద్రబాబు(Chandrababu) నిర్వహించబోయే విజన్ 2047 డాక్యుమెంటరీ పనులు దగ్గరుండి చేయిస్తున్నారు గంటా శ్రీనివాసరావు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ ఈ విజన్ 2047 డాక్యుమెంటరీ గురించి మాట్లాడి అలాగే పవన్ విశాఖలో మాట్లాడుతున్న వ్యాఖ్యలకు సపోర్ట్ గా మాట్లాడారు.
గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా జరుగుతున్న అంశాలు ప్రస్తావిస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన అంశాల పైన మాట్లాడుతున్నారు. దీనిపైన వైసీపీ నేతలు సమాధానాలు ఇవ్వకుండా వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు. విశాఖలో 128.5 ఎకరాల భూమిని తాకట్టు పెట్టారు. దీనిపైన పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పవిత్రంగా ఆరాధించే కొండల మీద దేవాలయాలను ఇళ్ళతో పోలుస్తున్నారు. సిగ్గులేకుండా వాటితో పోలుస్తున్నారు ఈ వైసీపీ నేతలు. ప్రభుత్వ నిర్మాణాలు చేపడితే వాటికి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదా. హామీల విషయంలో విఫలమయ్యారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కొత్తగా పరిశ్రమలు వచ్చింది ఏమీ లేదు అనిఫైర్ అయ్యారు.
ఇక గంటా శ్రీనివాసరావు పవన్ కి సపోర్ట్ గా మాట్లాడటంతో మరోసారి తెలుగుదేశం – జనసేన పొత్తులు చర్చకు వస్తున్నాయి.
Also Read : AP : చంద్రబాబు వద్ద కూలి పనిచేస్తున్న ‘పవన్’ – పేర్ని నాని సెటైర్లు