Ganta Srinivasa Rao : ఈ ఒక్క ఫోటో చాలు..జగన్ చేసిన గణకార్యాలు చెప్పడానికి – గంటా ట్వీట్

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల ఇవే అంటూ చాలా అంశాలను ఫోటోలో పొందుపర్చారు

Published By: HashtagU Telugu Desk
Ganta Tweet

Ganta Tweet

తెలంగాణ (Telangana) లో ఎలాగైతే ఎన్నికల హోరు నడుస్తుందో..ఏపీ (AP)లో కూడా ఎన్నికల వేడి ఇప్పటి నుండే మొదలవుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా టైం ఉన్నప్పటికీ అధికార పార్టీ (YCP) తో పాటు ప్రతి పక్ష పార్టీలు (TDP-Janasena) ఇప్పటి నుండే జనాల్లో నిలిచేందుకు పోటీ పడుతున్నారు. ఇప్పటికే వైసీపీ వై ఏపీ నీడ్స్ జగన్ (Why Ap Needs Jagan ) , సామాజిక సాధికార బస్సు యాత్ర (Saamajika Saadhikara Yatra) లతో ప్రజల్లోకి వెళ్లగా..ఇటు టీడీపీ – జనసేన పార్టీలు కలిసి తమ కార్యాచరణను స్పీడ్ చేస్తున్నాయి. ఇప్పటికి మేనిఫెస్టోపై కసరత్తు చేసేందుకు ఇరుపార్టీల నేతలు సమావేశమయ్యారు. మొత్తం 11 అంశాలతో మేనిఫెస్టోలో చేర్చాలని డిసైడ్ చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao ) సెటైర్లు వేశారు. ‘వై ఏపీ హేట్స్‌ జగన్‌’ అంటూ ఓ పోస్టర్‌ను ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల ఇవే అంటూ చాలా అంశాలను ఫోటోలో పొందుపర్చారు. జగన్ నాలుగేళ్ల ఎనిమిది నెలల కాలంలో చేసిన ఘన కార్యాలను చెప్పడానికి ఈ ఒక్క ఫోటో సరిపోతుందని జగన్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ‘ఏపీ హేట్స్‌ జగన్‌’, ‘వద్దు వద్దు.. ఈ జగన్’ ‘మళ్లీ మా కొద్దు ఈ జగన్‌’ అని ప్రజలు ఎందుకంటున్నారో ఇప్పటికైనా అర్థమైందా జగన్ ?’’ అని సెటైర్ వేశారు. వైసీపీ నేతలు ఏపీకి జగనే ఎందుకు కావాలి అంటూ ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దానికి కౌంటర్ గా గంటా శ్రీనివాసరావు ఈ పోస్టర్‌ను ట్విటర్‌ లో ఫోటో షేర్‌ చేశారు. ప్రస్తుతం గంటా చేసిన ట్వీట్ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది.

Read Also : AP High Court : స్కిల్ కేసులో చంద్ర‌బాబు రెగ్యుల‌ర్ బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ మ‌ధ్యాహ్నంకి వాయిదా

  Last Updated: 15 Nov 2023, 02:49 PM IST