ఏపీ(AP)లో చంద్రబాబు(Chandrababu) అరెస్ట్ అంశం రోజు రోజుకి మరింత ఉదృతం అవుతుంది. చంద్రబాబు అరెస్ట్ ని ఖండిస్తూ పలువురు సపోర్ట్ గా నిలుస్తుంటే, వైసీపీ(YCP) నాయకులు చంద్రబాబుపై, ఆయనకు సపోర్ట్ చేసే వారిపై విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) స్పందించలేదని, చంద్రబాబు సినీ పరిశ్రమ కోసం ఎంతో చేసినా వాళ్ళు కూడా స్పందించట్లేదని ఇప్పటికే పలువురు కామెంట్స్ చేశారు.
తాజాగా చంద్రబాబు అరెస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్, సినీ పరిశ్రమ వాళ్ళు ఎందుకు స్పందించట్లేదో విశాఖ నార్త్ ఎమ్మెల్యే, టీడీపీ నేత గంట శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) కామెంట్స్ చేశారు. నేడు విశాఖలో ఉన్న వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. చంద్రబాబు నాయుడు జైలు నుంచి నిర్ధోషిగా బయట పడాలని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
సినీ పరిశ్రమ మద్దతు గురించి అడగగా గంట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇప్పటికే రజనీకాంత్ సంఘీభావం ప్రకటించారు. చంద్రబాబు సచ్చీలత తనకు తెలుసని నిర్భయంగా తెలిపారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రముఖుల పట్ల జగన్ ఎలా వ్యవహరిస్తున్నారో చూస్తున్నాము. ప్రముఖ నటులు, డైరెక్టర్లు జగన్ వల్ల ఇబ్బందులకు గురయ్యారు. బహుశా అందుకే భయపడి ముందుకు రావడం లేదనిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం అతని వ్యక్తిగతం. స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు కూడా ఆయన హాజరవ్వలేదు అని అన్నారు. ఇక సినీ పరిశ్రమ నుంచి రాఘవేంద్రరావు, అశ్వినీదత్ కూడా చంద్రబాబుకి తమ మద్దతు తెలిపారు.
దీంతో గంట శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. జగన్ నిజంగానే సినీ పరిశ్రమని భయపెడుతున్నాడా? అందుకే ఎవ్వరూ స్పందించట్లేదా అనేది ఇప్పుడు చర్చగా మారింది.
Also Read : TDP-JSP : టీడీపీ – జనసేన పొత్త.. విజయవాడ వెస్ట్ సీటు జనసేనకే..?