AP : జగన్ కు ఇంకో ఛాన్స్ ఇస్తే ప్రాజెక్టులను కూడా తాకట్టు పెడతారు – గంటా

  • Written By:
  • Updated On - March 3, 2024 / 06:57 PM IST

రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టడం ఫై సీఎం జగన్ ఫై ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ కు ఇంకో ఛాన్స్ ఇస్తే ప్రాజెక్టులను కూడా తాకట్టు పెడతారంటూ వాపోతున్నారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రైనా సచివాలయాన్ని (Secretariat) అభివృద్ధి చేయాలనీ చూస్తారు..కానీ ఏపీ సీఎం జగన్ (CM Jagan) మాత్రం తాకట్టు (Hostage) పెట్టి రాష్ట్ర పరువు తీసారని ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఐదేళ్లుగా రాష్ట్రానికి రాజధానే లేకుండా చేసిన జగన్..ఇప్పుడు సచివాలయం కూడా లేకుండా చేసాడు. ఇప్పటికే అడ్డగోలుగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన జగన్..చివరికి రాష్ట్ర సచివాలయాన్నే తాకట్టుకు రాసిచ్చి రూ.370 కోట్ల అప్పు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణంలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన భవన సముదాయాన్ని కూడా అప్పుల కోసం వాడుకున్నారు. రాష్ట్ర బడ్జెట్‌ రూ.2.86 లక్షల కోట్లు. కానీ, కేవలం రూ.370 కోట్ల కోసం తాకట్టు పెట్టారని మండిపడుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు దీనిపై రియాక్ట్ అయ్యారు. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ భవనాలు తాకట్టు పెట్టేశారని… ఇప్పుడు ఏకంగా రాష్ట్ర సచివాలయాన్నే తాకట్టు పెట్టారని మండిపడ్డారు. అప్పుల ఊబిలో మునిగిపోయిన శ్రీలంక కూడా తమ పాలనా కేంద్రాన్ని తాకట్టు పెట్టలేదని కానీ ఇది ఒక జగనన్నకు మాత్రమే సాధ్యమనేలా అన్నింటిని తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. మళ్లీ జగన్‌కు ఇంకో అవకాశం ఇస్తే శ్రీహరికోట, సాగర్ డ్యాం, శ్రీశైలం డ్యాం, పోలవరం డ్యాంలను కూడా తాకట్టు పెట్టేస్తారేమో అని ఆరోపించారు. మూడు రాజధానులంటూ మూడు ముక్కలాటకు తెరలేపి… రాష్ట్రాన్ని ఒక్క రాజధాని కూడా లేకుండా చేసి.. చివరకి ఉన్న రాజధానిలోని రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశారని మండిపడ్డారు. నిన్న విశాఖలో 13 ప్రభుత్వ భవనాలు, కాలేజీలు తాకట్టుపెట్టి రూ.25 వేల కోట్లు అప్పు , మద్య షాపులను తాకట్టుపెట్టి రూ.48 వేల కోట్లు అప్పు , R&B ఆస్తులు తాకట్టు పెట్టి రూ.7 వేల కోట్లు అప్పు చేసారని మండిపడ్డారు.

Read Also : Jithender Reddy : మహబూబ్ నగర్ సీటు నాకే అంటున్న జితేందర్ రెడ్డి