గత నాలుగేళ్లుగా నిరుద్యోగులను పట్టించుకోని సీఎం జగన్ (CM Jagan)..సరిగ్గా ఎన్నికలు వస్తున్న తరుణంలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్ల (APPSC Group 1 ,2 Notification)పేరుతో రాష్ట్రంలో మరో కొత్త మోసానికి తెరలేపారని టీడీపీ నేత గంటా శ్రీనివాస్ రావు (Ganta Srinivas Rao) ఆరోపించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా జగన్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు.
”2021లో జాబ్ క్యాలెండర్ కింద ప్రకటించిన గ్రూపు-2 నోటిఫికేషన్‌ను రెండు రోజుల క్రితం విడుదల చేశారు. కొన్నినెలల కిందట ప్రకటించిన గ్రూపు-1 నోటిఫికేషన్‌ను నిన్న జారీ చేశారు. మొన్నటికి మొన్న అదిగో డీఎస్సీ.. ఇదిగో డీఎస్సీ.. అంటూ నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించారు. చివరికి ఆ ఊసే లేకుండా చేశారు. ఇదంతా ఎన్నికల జిమ్మిక్కు కాకుండా మరేమిటి? నోటిఫికేషన్ల ప్రకారం చూస్తే ఫిబ్రవరి 25న గ్రూప్-2 ప్రిలిమ్స్.. మార్చి 17న గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించనున్నారు. ఈ రెండింటికీ మెయిన్స్ పరీక్షలను కొత్తగా ఏర్పడే ప్రభుత్వం హయాంలోనే నిర్వహించాల్సి ఉంటుంది. అంటే.. ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ప్రిలిమ్స్ పరీక్షలు కూడా నిర్వహించేందుకు అవకాశం ఉండదు. ఇదంతా మీకు ముందే తెలుసు. నిరుద్యోగుల భవిష్యత్తును కూడా ఎన్నికల అస్త్రంగానే వాడుకుంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
నిజంగా జగన్ ప్రభుత్వానికి ఉద్యోగాలు భర్తీ చేయాలనే చిత్తశుద్ధి ఉంటే ఒక 6 నెలల ముందే నోటిఫికేషన్ జారీ చేసేవారు. ఒక ప్రణాళిక లేకుండా నోటిఫికేషన్ ఇచ్చి, ఎన్నికల ముందు పరీక్షలు నిర్వహిస్తామనడం నిరుద్యోగులను మోసం చేయడమే అవుతుంది. నిరుద్యోగులు గ్రూప్-1, గ్రూప్-2 ఈ రెండింటికీ దరఖాస్తు చేసుకుంటారు. గ్రూప్-2 సిలబస్‌తో పోల్చితే గ్రూప్-1 సిలబస్‌లో అదనపు సబ్జెక్టులుంటాయి. గ్రూప్-2 ప్రిలిమ్స్ జరిగిన 20 రోజుల్లోనే గ్రూప్-1 అదనపు సబ్జెక్టులకు అభ్యర్థులు సిద్ధం కావడం చాలా కష్టమని నిరుద్యోగులు వాపోతున్నారు. మీ మోసపూరిత మేనిఫెస్టో మాదిరిగా ఎన్నికల ముందు హడావుడిగా నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగుల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. ఈ పరీక్షలకు నిరుద్యోగులు సన్నద్ధం కావటానికి కనీసం 4 నెలలు పడుతుంది. తగిన సమయం ఇవ్వకుండా డిసెంబరులో నోటిఫికేషన్ ఇచ్చి, ఫిబ్రవరిలో పరీక్షలు నిర్వహిస్తామంటే ఎలా? చివరికి ఏదోలా కష్టపడి పరీక్షలకు సిద్ధమైతే.. ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తే వారు పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరేనా?” అని గంటా ఆగ్రహం వ్యక్తం చేసారు.
శుక్రవారం గ్రూప్ -2 నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ (APPSC) విడుదల చేసింది. 897 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566 ఉన్నాయి. 2024 ఫిబ్రవరి 25 ప్రిలిమనరీ పరీక్ష జరగనుంది. ఈ నెల (డిసెంబర్) 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. నూతన సిలబస్, నూతన నియామక ప్రక్రియలో ఈసారి గ్రూప్-2 నోటిఫికేషన్ (APPSC Group 2 Notification 2023) ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నారు. నూతన సిలబస్, నూతన నియామక ప్రక్రియలో ఈసారి గ్రూప్–2 నోటిఫికేషన్ ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపింది.
Read Also : Revanth Reddy : కేసీఆర్ ప్రభుత్వంలోని సలహాదారులను తొలగించిన రేవంత్ సర్కార్