విశాఖపట్నంలో జరిగిన మినీ మహానాడు (Mini Mahanadu) కార్యక్రమం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగా, ఈ కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజ (Ganta Raviteja) హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన తండ్రి వేదికపై ప్రసంగిస్తున్న సమయంలో రవితేజ సభికుల ముందుకొచ్చి ఇచ్చిన నినాదాలు కాస్త షాక్ కు గురి చేసాయి. ముఖ్యంగా ఆయన మాట్లాడుతూ “జోహార్ సీఎం చంద్రబాబు… జోహార్ నారా లోకేశ్” అంటూ నినాదాలు చేసాడు. అయితే ఈ టీడీపీ నిర్వాకులు కూడా అలాగే రవితేజ వ్యాఖ్యలకు వంతాసు పలికారు కానీ ఆ తర్వాత ఒక్కసారికి షాక్ కు గురయ్యారు. అది పొరపాటు అని పార్టీ శ్రేణులు గుర్తించినప్పటికీ, అప్పటికే వీడియో వైరల్ అయిపోయింది.
Dhawan Buys Apartment: శిఖర్ ధావన్ కొత్త అపార్ట్‌మెంట్.. ఏకంగా రూ. 69 కోట్లు పెట్టి!
వైసీపీ సోషల్ మీడియా వర్గాలు ఈ వీడియోను తమ ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్ చేస్తూ విమర్శలు మొదలుపెట్టారు. ఈ ఘటన వల్ల రవితేజ నిర్లక్ష్యంగా వ్యవహరించాడనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే పార్టీ శ్రేణులు మాత్రం ఇది ఉద్దేశపూర్వకంగా కాకుండా ఉత్సాహంలో జరిగిన మాటల తడబాటు అని పేర్కొంటున్నారు.
Dhawan Buys Apartment: శిఖర్ ధావన్ కొత్త అపార్ట్‌మెంట్.. ఏకంగా రూ. 69 కోట్లు పెట్టి!
ఇదిలా ఉంటే.. గంటా రవితేజ రాజకీయ రంగప్రవేశం దాదాపు ఖరారైందని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొనడం, మద్దతుదారులతో మమేకం కావడం చూస్తే, ఆయన వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. గంటా శ్రీనివాసరావు వారసుడిగా రాజకీయంగా ఎదగాలని రవితేజ ప్రయత్నిస్తుండగా, ఈ తాజా ఘటన ఆయనకు ఓ అనుభవం గా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
😂🤣 మినీ మహానాడు లో జోహార్ సీఎం చంద్రబాబు…. జోహార్ నారా లోకేశ్ pic.twitter.com/L5GWHANmfk
— Rahul (@2024YCP) May 20, 2025