Chandra Babu Attraction: ఉత్తరాంధ్రలో ‘గంటా’ చిచ్చు! మళ్లీ బాబు చెంతకు..!!

తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్న ఆ పారీ ఎమ్మెల్యేలు మళ్లీ చంద్రబాబు ప్రసన్నం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ జాబితాలో గంటా శ్రీనివాసరావు ముందున్నారు.

  • Written By:
  • Updated On - March 19, 2023 / 08:40 PM IST

తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్న ఆ పారీ ఎమ్మెల్యేలు మళ్లీ చంద్రబాబు (Chandra Babu) ప్రసన్నం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ జాబితాలో గంటా శ్రీనివాసరావు ముందున్నారు. మూడేళ్ళ క్రితం పార్టీకి రాజీనామా చేసిన ఆయన ఇప్పుడు ఉత్తరాంధ్ర పట్టభద్రుల టీడీపీ అభ్యర్థి గెలుపును సొంత ఖాతాలో వేసుకోవడానికి జిమ్మిక్కులు మొదలు పెట్టారు. సహజంగా ఏ ఎండకు ఆ గొడుగు పట్టే లీడర్ గా ఆయనకు పేరుంది. అక్కడ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడుకు ఆయనకు గ్యాప్ ఉంది. మూడేళ్ళుగా అయ్యన్న పార్టీని మోస్తున్నారు. అధికార పార్టీ ఆరాచకాలను ఎదుర్కొన్నారు. ఇప్పటి వరకు పార్టీకి మొఖం కూడా చూపని గంట తన వల్ల టీడీపీ గెలిచిందని తెరవెనుక ప్రచారం మొదలు పెట్టారు. అంతే కాదు అభ్యర్థి చిరంజీవిని సూచించింది కూడా తనే అంటూ ఫోకస్ ఇస్తున్నారు. పార్టీకి అసలు ఏ మాత్రం సంబంధం లేని విద్యావేత్త అయిన వేపాడ చిరంజీవిరావు పేరుని గంటాయే ప్రతిపాదించారని అంటున్నారు.

ఒక టీడీపీ ఎమ్మెల్యే సాయంతో వేపాడను చంద్రబాబు (Chandra Babu) దగ్గరకు పంపించి వేపాడను అభ్యర్ధిగా గంటా ఓకే చేయించారు. నిజానికి అప్పటికే చంద్రబాబు మరో మాజీ మంత్రి గంటా అంటే పెద్దగా గిట్టని చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రతిపాదించిన బీసీ మహిళా కార్పోరేటర్ గాడు చిన్ని లక్ష్మీ కుమారి అభ్యర్ధిత్వాన్ని ఓకే చేశారు. మూడు నెలల పాటు ఆమె ప్రచారం కూడా నిర్వహించారు.

అలాంటిది ఆమె ప్లేస్ లో వేపాడను చివరి నిముషంలో తేవడంలోనే గంటా మార్క్ వ్యూహం ఉంది అంటున్నారు. ఇక వేపాడను ఎంపిక చేయడం వేనక బలమైన కాపు సామాజికవర్గం ఉంది. అలాగే కోచింగ్ సెంటర అధినేతగా ఆయనకు సొంతంగా నెట్ వర్క్ ఉంది. జనసేన కూడా మద్దతు ఇచ్చే వీలు కుదిరింది. ఇలా అన్నీ ఆలోచించి గంటా వేసిన ఈ మాస్టర్ ప్లాన్ తో వైసీపీకి దిమ్మదిరిగిపోయిందని సొంత మీడియా ద్వారా ప్రచారం మొదలు పెట్టారు.

వేపాడ అభ్యర్థిత్వం ఖరారు అయ్యాక గంటా అన్నీ తానే అయి తిరిగారని సోషల్ మీడియాలో ఉదర కొడుతున్నారు. ఆయన తన పరిచయాలను ఉపయోగించారని, మొత్తానికి గ్రాండ్ సక్సెస్ అయ్యారని ప్రచాస్రం. ఇపుడు గంటా లైం లైట్ లోకి మళ్ళీ వచ్చేశారు. తెలుగుదేశానికి ఉత్తరాంధ్రాలో ఆయన పెద్ద దిక్కుగా మారిపోయారు. నాలుగేళ్లుగా గంటా సౌండ్ చేయడంలేదని ఆయన వైసీపీలోకి వెళ్తారని జనసేనలో చేరుతారని ప్రచారం సాగింది.

అయింతే గంటా సైలెంట్ గానే ఉన్నారు. నో అని ఎక్కడా ఖండించలేదు. సరైన టైం లో తాను రావాలని చూశారు. నాలుగేళ్ళ తరువాత ఏపీ రాజకీయాల్లో మార్పులను గమనించారు. తాను ఉన్న పార్టీలోనే కంటిన్యూ కావాలనుకున్నారు. అయితే తనను పార్టీ అధినాయకత్వం ఎలా నమ్ముతుంది అనుకున్నారేమో ఎమ్మెల్సీ ఎన్నిక రూపంలో భారీ విజయాన్ని అందించి తన సత్తా రుజువు చేసుకున్నారు. ఇపుడు గంటా ఉత్తరాంధ్రాలో తెలుగుదేశానికి అత్యంత కీలకమైన నేతగా మారిపోయారు.అంగబలం అర్ధబలం నిండుగా ఉన్న గంటా రాజకీయాలను చూస్తున్న సొంత పార్టీలో ని తమ్ముళ్లే ఔరా అని అనుకోవాల్సి వస్తోంది.గంటా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ఫార్ములాను అప్పట్లో సమర్ధించారాని అలా నాడు జగన్ ను పొగిడి ఇప్పుడు వైసీపీని కార్నర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేత ఒకరు ఇపుడు గుర్తు చేశారు. తన సమీప బంధువు మాజీ మంత్రి నారాయణను వైసీపీ ఇబ్బందులకు గురిచేస్తున్న సమయంలో కూడా గంటా మౌనంగా ఉన్నారనే విమర్శలున్నాయి. అయితే రాజకీయాల్లో నిన్నలకు విలువ ఉండదు నేటికే వాల్యూ. ఈ రోజు గంటా చంద్రబాబుకు కావాల్సిన వారుగా ఉన్నారు. దాంతో మరోమారు చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారు. ఇలా సొంత సోషల్ మీడియా ద్వారా ప్రచారం మొదలు పెట్టిన గంటా మళ్లీ పార్టీలోకి వస్తే ఉత్తరాంధ్ర టీడీపీలో రచ్చ రేగినట్టే. మరి. చంద్రబాబు ఏమి చేస్తారో చూడాలి.

Also Read:  2016 WH Asteroid: ఇవాళ భూమికి దగ్గరగా 2 ఆస్టరాయిడ్స్.. వాటి రూట్ మ్యాప్ ఇదీ