గన్నవరం పంచాయతీలో 1.58లక్షల నిధుల దుర్వినియోగంలో అయ్యాయి. నిధుల దుర్వినియోగంలో ప్రధానంగా అభియోగాలు ఎదుర్కొంటున్న పంచాయతీ కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్ ను సస్పెండ్ చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీరాజ్ కమిషనర్ జారీ చేసిన ఆదేశాలను సోమవారం కార్యదర్శికి అందజేసినట్లు ఇంఛార్జి ఎంపిడిఓ వెంకటేశ్వరరావు తెలియజేశారు. గన్నవరం గ్రామపంచాయతీకి చెందిన నిధులు దుర్వినియోగం అయ్యాయనీ, సర్పంచ్ సౌజన్య కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్ లు సొమ్ములు స్వాహా చేశారని పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఎంపీటీసీలు గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్ నుండి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.. ఈ నిధుల దుర్వినియోగంలో పంచాయతీ కార్యదర్శిని ప్రధాన బాధ్యునిగా పేర్కొంటూ కమిటీ నివేదిక ఇచ్చింది. దీంతో పంచాయతీ కార్యదర్శిని విధుల నుండి సస్పెండ్ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
Andhra Pradesh : గన్నవరం పంచాయతీలో నిధుల దుర్వినియోగం.. కార్యదర్శిపై వేటు వేసిన అధికారులు

gannavaram