Site icon HashtagU Telugu

AP BRS: కార్మికుల జీవితాలతో గంగవరం పోర్టు యాజమాన్యం చెలగాటం: బీఆర్ఎస్ ఏపీ చీఫ్

Thota

Thota

గంగవరం పోర్టు కార్మికులకు కనీస వేతనం చెల్లించకుండా పోర్టు యాజమాన్యం వారి జీవితాలతో చెలగాటమాడుతొందని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు . అదాని గంగవరం పోర్టులో పనిచేస్తున్నకార్మికులను యాజమాన్యం అక్రమంగా తొలగించడం అన్యాయమని తోట మండిపడ్డారు. కార్మికులకు బిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపి వారికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్నారు.

గంగవరం పోర్టు నిర్మాణంతో వేటకు దూరమైన మత్ష్యకారుల కుటుంబాలు ఇప్పటికే రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోర్టులో కార్మిక చట్టలను అమలు చేయాలని ప్రశ్నించిన 29 మంది కార్మికులను లక్ష్యంగా చేసుకొని యాజమాన్యం వారిని ఉద్యోగాల నుండి తొలగించడం అన్యాయమన్నారు.

కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా పోర్టు యాజమాన్యం వ్యవహరించడం దుర్మార్గమన్నారు. విధుల నుండి తొలగించబడిన 29 మంది కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు,పోర్టులో కార్మిక చట్టాలు అమలు చేసి,కార్మికులకు రూ36 వేలు వేతనం పోర్టు యాజమాన్యం చెల్లించేలా జగన్ సర్కార్ చొరవ చూపాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మికుల తొమ్మిది న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం ఆమోదించేలా ప్రభుత్వం వారిపై వత్తిడి తేవాలని తోట చంద్రశేఖర్ శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు.

Also Read: Raasi: ప్రభాస్ అంటే చాలా ఇష్టం, ఆయనతో నటించాలనేది నా కోరిక : హీరోయిన్ రాశి

Exit mobile version