Gambling:గుడివాడ కు ‘గోవా’ జూదం

సంక్రాంతి పండుగ కృష్ణా జిల్లా గుడివాడ మరో గోవా మారింది. ఏపీలో హాట్ నియోజకవర్గ గా ఉండే గుడివాడ మంత్రి కొడాలి నాని సొంతం. ఆ నియోజక వర్గం నుంచి ఐదు సార్లు వరుస విజయాలను అందుకున్నాడు. అందుకే మంత్రిగా ఆయనకు జగన్ పెద్దపీట వేశాడు.

  • Written By:
  • Updated On - January 16, 2022 / 08:57 PM IST

సంక్రాంతి పండుగ కృష్ణా జిల్లా గుడివాడ మరో గోవా మారింది. ఏపీలో హాట్ నియోజకవర్గ గా ఉండే గుడివాడ మంత్రి కొడాలి నాని సొంతం. ఆ నియోజక వర్గం నుంచి ఐదు సార్లు వరుస విజయాలను అందుకున్నాడు. అందుకే మంత్రిగా ఆయనకు జగన్ పెద్దపీట వేశాడు. దూకుడుగా వెళుతూ ఏపీ సీఎం మీద మాట పడకుండా మీడియా లో హల్చల్ చేసున్నాడు. అందుకే ప్రత్యర్దులు ఆయన మీద రాజకీయ నిఘా పెట్టారు. సంక్రాంతి సందర్భంగా గా గుడివాడలో కాసినోస్ లాగా జూదం ఆడించిన వీడియోలను సోషల్ మీడియా కు ఎక్కించారు.

ఆ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సేమ్ టూ సేమ్ గోవా సెట్టింగులతో కాసినోస్ కు గుడివాడ కేంద్రం అయింది.
జూదం, గుట్కా తదితర నేర అంశాలు వెలుగు చూసినప్పుడు గుడివాడ తెరమీదకు వస్తుంది. గతంలో పేకాట క్లబ్ లు నడుపుతున్నా గుడివాడ బ్యాచ్ పై పోలీసులు రైడింగ్ చేశారు. పలువురిపై కేసులు పెట్టారు. విచారణలో జూదరులు, క్లబ్స్ నిర్వహిస్తున్న వాళ్ళు మంత్రి కొడాలి అనుచరులు అని అప్పట్లో తేలింది. ఇదే అంశంపై అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. ఆ సందర్భంగా కొడాలి ఇచ్చిన సమాధానం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

జూదరులను అరెస్ట్ చేస్తే ఏమౌతుంది..బెయిల్ పై వస్తారంటూ ఆయన చేసిన కామెంట్ ప్రత్యర్థులకు అప్పట్లో అస్త్రంగా మారింది. జనసేనాని పవన్ గుడివాడ మీడింగులో పేకాట మంత్రి అంటూ ఆరోపణలు చేశాడు. పేకాట డెన్ లను కొడాలి నాని నడుపుట్జున్నాడని విరుచుకు పడ్డాడు. దానిపై వారం పాటు పెద్ద ఎత్తున పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా గోవా తరహాలో కాసినోస్ గుడివాడ లో బాహాటంగా నడపటం చర్చనీయాంశం అయింది.

సంక్రాంతి పండుగ ఏపీకి ప్రత్యేకం అని చెప్పాలి. ఆ సందర్భంగా కోడి పందెం వేస్తుంటారు. పోలీసులు సైతం అడ్డుకోలేని విధంగా ఆ పందేలు జరుగుతాయి. కొన్ని చోట్ల పొట్టేలు పందెం జరుగుతుంటాయ్. ఆ క్రమంలో బెట్టి గులు భారీగా కాస్తుంటారు. ఇవన్నీ ప్రతి ఏడాది జరుగుతుంటాయి. కానీ ఈసారి కొత్తగా కాసినోస్ నడపటం గమనార్హం.

పైగా అక్కడి నిర్వాహకులను గమనిస్తే గోవా నుంచి దిగుమతి అయినట్టు కనిపిస్తుంది. మహిళలు కూడా కాసినోస్ నిర్వాహకులుగా ఉన్నట్టు వీడియోలో ఉంది. కాసినోస్ కోసం గుడివాడలో ఏర్పాటు చేసిన సెట్టింగ్స్ చూస్తే గోవాలో ఉన్నామా అనే ఫీల్ ఉంది. జూదం కోసం పెద్ద ఎత్తున సెట్టింగ్స్ వేశారు అంటే దాని వెనుక పొలిటికల్ పెద్దలు లేరని చెప్పలేం. పైగా కాసినోస్ ఏపీలో చట్టవిరుద్దం. కానీ యథేచ్ఛగా కాసినోస్ గుడివాడ లో జరిగింది. అంటే ఏపీ ప్రభుత్వం త్వరలో అధికారికంగా అనుమతి ఇస్తుందా?లేక సంక్రాంతి కానుక కింద వదిలేసిందా? అనేది బోధపడటం లేదు. సో..మంత్రి కొడాలి నాని ఈ కోసినోస్#గుడివాడ మీద ఎలా రియాక్ట్ అవతాడో చూద్దాం!