YCP : పవన్ ఫై వైసీపీ ఎవర్ని దించుతుందో తెలుసా..?

గత ఎన్నికల్లో భారీ విజయం సాధించిన వైసీపీ (YCP)..ఈసారి 175 కు 175 సాధించాలని పట్టుదలతో ఉంది. ఇందుకోసం జగన్ భారీ ప్లాన్ లు వేస్తున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో కీలక నిర్ణయం తీసుకొని వారి షాక్ ఇస్తున్నారు. ఇదే క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను ఓడించేందుకు భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి..రెండు చోట్ల ఓడిపోయిన సంగతి తెలిసిందే. […]

Published By: HashtagU Telugu Desk
Pawan Kalyan

Pawan Kalyan

గత ఎన్నికల్లో భారీ విజయం సాధించిన వైసీపీ (YCP)..ఈసారి 175 కు 175 సాధించాలని పట్టుదలతో ఉంది. ఇందుకోసం జగన్ భారీ ప్లాన్ లు వేస్తున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో కీలక నిర్ణయం తీసుకొని వారి షాక్ ఇస్తున్నారు. ఇదే క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను ఓడించేందుకు భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది.

గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి..రెండు చోట్ల ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా పవన్ రెండు చోట్ల పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. వాటిలో గాజువాక ఒకటి. ఇప్పటికే గాజువాక (Gajuwaka) లో గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఫై పోటీగావిశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంటక కుమారి (Golagani Hari Venkata Kumari) ని దించాలని జగన్ డిసైడ్ అయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

గత ఎన్నికల్లో ఈ నియోజక వర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఓడించి వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన తిప్పల నాగిరెడ్డి విజయం సాధించారు. అయితే ఈసారి ఆయనకు టికెట్ నిరాకరించిన అధిష్టానం యాదవ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్ ఉరికూటి రామచంద్రరావును నియమించింది. అయితే ఆ నియామకం పట్ల శాసనసభ్యుడు నాగిరెడ్డి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

రామచంద్రరావుకు తాము సహకరించేది లేదంటూ నాగిరెడ్డి అడ్డం తిరగడంతో అధిష్టానం మరో మార్గం లేక అదే సామాజిక వర్గానికి చెందిన మేయర్ హరి వెంటక కుమారి అభ్యర్ధిత్వానికి మొగ్గు చూపింది. గాజువాకకు చెందిన చినతల్లి పేరును నాగిరెడ్డి వర్గం ప్రతిపాదించినప్పటికీ అధిష్టానం అంగీకరించలేదని తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో వెలువడనున్న ఐదవ జాబితాలో మేయర్ పేరు ప్రకటించనున్నారని తెలుస్తోంది. మరి పవన్ ఫై ఈమె గెలుస్తుందా అనేది చూడాలి.

Read Also : Paytm – Ayodhya Offer : 100 శాతం క్యాష్ బ్యాక్.. అయోధ్య యాత్రికులకు పేటీఎం బంపర్ ఆఫర్

  Last Updated: 30 Jan 2024, 02:09 PM IST