YSRCP : ‘మండలి’లో వైఎస్సార్ సీపీకి ఫుల్ మెజారిటీ.. ప్రభావం చూపగలరా ?

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో టీడీపీకి ఇప్పుడు తిరుగులేని మెజారిటీ ఉంది. అయితే శాసన మండలిలో వైఎస్సార్ సీపీ ఇంకా స్ట్రాంగ్‌గానే ఉంది.  

  • Written By:
  • Publish Date - June 18, 2024 / 07:44 AM IST

YSRCP : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో టీడీపీకి ఇప్పుడు తిరుగులేని మెజారిటీ ఉంది. అయితే శాసన మండలిలో వైఎస్సార్ సీపీ ఇంకా స్ట్రాంగ్‌గానే ఉంది.  శాసనమండలిలోని మొత్తం 58 స్థానాల్లో38 ఇంకా వైఎస్సార్ సీపీ దగ్గరే ఉన్నాయి. ఉపాధ్యాయ కోటాలో గెలిచిన వారు సాంకేతికంగా ఇండిపెండెంట్లు అయినప్పటికీ వారంతా వైసీపీ నేతలుగానే ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు అందుకే శాసన మండలిలో వైఎస్సార్ సీపీకి ఉన్న ఎమ్మెల్సీల సంఖ్య 42 అవుతుంది. టీడీపీకే ఎనిమిది మంది ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నారు. మరో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.  ఇప్పుడు టీడీపీ అధికార పీఠంపై ఉండటంతో.. ఈ 6 స్థానాలు ఆ పార్టీ కైవసం కావడం ఖాయం. అయినా ఇంకో నాలుగేళ్ల పాటు శాసన మండలిలో వైఎస్సార్ సీపీకే మెజారిటీ ఎమ్మెల్సీల బలం ఉంటుంది. దీని వల్ల ఏమవుతుంది? టీడీపీ ప్రభుత్వాన్ని వైఎస్సార్ సీపీ(YSRCP) ప్రభావితం చేయగలదా ?

We’re now on WhatsApp. Click to Join

వాస్తవానికి శాసనమండలిలో ఉన్న మెజారిటీతో ఏపీ ప్రభుత్వ నిర్ణయాలను వైఎస్సార్ సీపీ ప్రభావితం చేయలేదు. ఒకవేళ ఏపీ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను శాసన మండలి తిరస్కరించినా.. ఏపీ సర్కారు ఆ బిల్లులను నేరుగా గవర్నర్‌ ఆమోదం కోసం పంపొచ్చు.  అక్కడి నుంచి ఆ బిల్లుకు సంబంధించిన గెజిట్‌ను విడుదల చేయించుకోవచ్చు. ఈ అవకాశాలు ఉన్నప్పటికీ  శాసనమండలిలో మెజార్టీ లేకపోవడాన్ని టీడీపీ సీరియస్‌గా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో పలువురు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీలు టీడీపీలో చేరే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.  అయితే శాసన మండలి రద్దు వంటి నిర్ణయాలను సీఎం చంద్రబాబు తీసుకునే అవకాశమే లేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి క్రమంగా శాసనమండలిలో వైఎస్సార్ సీపీ బలాన్ని తగ్గించే వ్యూహంతో టీడీపీ ముందుకు సాగుతుందని అంచనా వేస్తున్నారు.

Also Read :Kavach Safety System: రైల్వేలో కవాచ్ రక్షణ వ్యవస్థ అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది..?

మండలి రద్దుకు జగన్ యత్నాలు.. గతంలో

  • శాసన మండలిని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ  2020 జనవరి 27న ఓ తీర్మానాన్ని ఆమోదించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్  169 (1) ప్రకారం మండలిని రద్దు చేస్తున్నట్లుగా ఆ తీర్మానంలో పేర్కొన్నారు.
  •  శాసనమండలి పనికి రాదంటూ అప్పట్లో వైఎస్ జగన్ ఇచ్చిన స్పీచ్ వైరల్ అయింది.
  • అయితే అప్పటి జగన్ సర్కారు పంపిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.
  • ఈనేపథ్యంలో శాసన మండలి రద్దు కోసం గతంలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు నాటి ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి 2021 నవంబర్‌లో సభలో ప్రకటించారు.

Also Read :Vastu Tips For Bathing: స్నానం చేసే నీటిలో ఈ 5 వస్తువులను కలిపితే.. అడ్డంకులు అన్నీ తొలగిపోతాయట..!