Site icon HashtagU Telugu

Amararaja : స్కాలర్ షిప్ తో ఉచిత శిక్షణ.. అమరరాజా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ లో గొప్ప అవకాశం

Amararaja

Amararaja

Amararaja : నిరుద్యోగ యువతకు మంచి అవకాశం. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పూతలపట్టులో ఉన్న అమరరాజా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ లో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందించనున్నారు. ఉపకార వేతనం ఇస్తూ ఈ ట్రైనింగ్ అందిస్తారు. శిక్షణ తర్వాత పనితీరు ఆధారంగా ఉద్యోగ అవకాశం కూడా కల్పిస్తామని అమరరాజా యాజమాన్యం వెల్లడించింది. అమరరాజా సంస్థకు చెందిన మద్దతు రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2014లో అమరరాజా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ ను చిత్తూరుజిల్లా పూతలపట్టు మండలం పేటమెట్ట గ్రామంలో ఏర్పాటుచేశారు.

We’re now on WhatsApp. Click to Join

ఇప్పటివరకు ఈ సంస్థ ద్వారా 14 బ్యాచులలో 1314 మంది నిరుద్యోగ యువత ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. వారందరికీ అమరరాజా సంస్థలో పర్మినెంట్ జాబ్స్ ఇచ్చారు. అమర రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లో 10వ తరగతి పాస్ / ఫెయిల్ లేదా ఇంటర్ పాస్ / ఫెయిల్ అయిన నిరుద్యోగ యువతీ యువకులకు 33వ బ్యాచ్ అడ్మిషన్స్ ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. ఎంపికయ్యే విద్యార్థులకు ట్రైనింగ్ టైంలో మొదటి మూడు నెలలు, నెలకు రూ.7500 చొప్పున స్కాలర్ షిప్ ఇస్తారు. ఆ తర్వాత 21 నెలలు రూ.11,453 నుంచి రూ.11853 మధ్య స్కాలర్ షిప్ పొందొచ్చు. వివరాల కోసం 9000024919, 9100477371 నెంబర్లలో సంప్రదించాలని అమర రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ (Amararaja)  కోరింది.

Also read : Annaya : అనన్య అందాల కోసం కుర్రాళ్ళ యుద్దాలు చేస్తారేమో