Site icon HashtagU Telugu

Free Gas : దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్లు – మంత్రి నాదెండ్ల ప్రకటన

Free Gas

Free Gas

Free Gas Cylinders Scheme : ఏపీ మహిళలకు మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) గుడ్ న్యూస్ తెలిపారు. దీపావళి (Diwali) కానుకగా ఉచిత గ్యాస్ (Free Gas Cylinders Scheme) అందిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ సూపర్ సిక్స్ లో భాగంగా పలు హామీలను నెరవేర్చి ప్రజల్లో నమ్మకం నిలుపుకుంది. మిగతా హామీలను కూడా నెరవేర్చే పనిలో ఉంది. ఈ క్రమంలో దీపావళి నుండి ఫ్రీ గ్యాస్ లను అందజేసేందుకు సిద్ధం అవుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా మహాశక్తి పథకాన్ని ప్రారభించబోతున్నట్లు మంత్రి మనోహర్ తెలిపారు. ఈ పథకం ద్వారా, ప్రభుత్వానికి అనుగుణంగా 1.47 కోట్ల తెల్లరేషన్ కార్డు దారులకు ప్రతి సంవత్సరం 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించబడుతుంది. ఈ పథకం అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ పథకంలో భాగంగా, ఉచిత గ్యాస్ సిలిండర్ల ద్వారా సుమారు రూ. 3640 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో, మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, దీపావళి పండుగ సందర్భంగా ప్రతి ఇంట్లో వెలుగులు రానున్నాయని తెలిపారు. పేద కుటుంబాలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం ద్వారా వారికి ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడిందని ఆయన వెల్లడించారు.

Read Also : IAS Prasanthi : ఐఏఎస్ ప్రశాంతికి పోస్టింగ్ ఇచ్చిన ఏపీ సర్కార్