Site icon HashtagU Telugu

AP Housing : ఏపీలో ఉచితంగా ఇళ్ల స్థలాల పంపిణీ..వేలల్లో దరఖాస్తులు

Free Distribution Of House

Free Distribution Of House

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) పేదల కలను సాకారం చేయడానికి ఇళ్ల స్థలాల ఉచిత పంపిణీ పథకాన్ని(Free distribution of house plots scheme) ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున ఉచితంగా ఇళ్ల స్థలాలను అందజేయాలని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేయడానికి చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీకి మార్గదర్శకాలు విడుదల చేయడంతో, రాష్ట్రవ్యాప్తంగా వేలాదిగా దరఖాస్తులు వస్తున్నాయి.

Big Shock To Maoist : 14 మంది మావోయిస్టులు లొంగుబాటు

70,000కి పైగా దరఖాస్తులు – నాలుగు లక్షల ఆర్థిక సాయం

ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad) అసెంబ్లీలో ఈ పథకంపై కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు 70,232 మంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా, ఇంటి నిర్మాణానికి రూ. 4 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని స్పష్టంచేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కేవలం 1 సెంటు స్థలం మాత్రమే ఇచ్చారని, తమ ప్రభుత్వం మాత్రం గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తోందని మంత్రి విమర్శించారు.

అందరికీ ఇళ్లు పథకం అర్హతలు

ఈ పథకానికి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు మాత్రమే అర్హులు. మహిళల పేరుతోనే ఈ ఇంటి స్థలాలను పంపిణీ చేయనున్నారు. రేషన్ కార్డు ఉండాలి, 5 ఎకరాల్లోపు మెట్ట భూమి లేదా 2.5 ఎకరాల్లోపు మాగాణి భూమి కలిగి ఉండాలి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వాల నుంచి ఇళ్ల స్థలాలు పొందినవారు ఈ పథకానికి అర్హులు కారు. ఒకసారి ఇంటి పట్టా మంజూరు అయితే, 10 ఏళ్ల తరువాతే దానికి పూర్తి హక్కులు లభిస్తాయి.

Duvvada : హాట్ ప్రాపర్టీగా మారిన దువ్వాడ

పథకం అమలు – భవిష్యత్ ప్రణాళికలు

ఇళ్ల స్థలాల పంపిణీ జరిగిన రెండేళ్లలోపు నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. ఇందులో సంబంధిత ఏజెన్సీల సహాయంతో ఇంటి నిర్మాణాలు చేపడతారు. పేదలు తక్కువ సమయంలో సొంత ఇంటిని కలిగి, సురక్షితమైన జీవితాన్ని గడపాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని వేలాది మంది నిరాశ్రయులు ఇళ్ల కలను సాకారం చేసుకునే అవకాశం ఉంది.