AP : రేవంత్ బాటలో జగన్..సంక్రాంతి నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం..?

ఏపీ (AP) అధికార పార్టీ వైసీపీ (YCP)..తెలంగాణ కాంగ్రెస్ (Congress) బాటలో పయనించబోతుందా..? తెలంగాణ లో ఎలాగైతే ఉచిత పథకాలు ప్రకటించి అధికారంలోకి వచ్చారో..ఇప్పుడు జగన్ కూడా అలాంటి ఉచిత పథకాలు ప్రకటించి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా…? అంటే అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. ముఖ్యంగా తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణాలైన..మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం, రూ.500 లకే గ్యాస్, మహిళలకు రూ.2500 భృతి, రెండు వందల యూనిట్ల వరకు […]

Published By: HashtagU Telugu Desk
Jagan Free Bus

Jagan Free Bus

ఏపీ (AP) అధికార పార్టీ వైసీపీ (YCP)..తెలంగాణ కాంగ్రెస్ (Congress) బాటలో పయనించబోతుందా..? తెలంగాణ లో ఎలాగైతే ఉచిత పథకాలు ప్రకటించి అధికారంలోకి వచ్చారో..ఇప్పుడు జగన్ కూడా అలాంటి ఉచిత పథకాలు ప్రకటించి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా…? అంటే అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు. ముఖ్యంగా తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణాలైన..మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం, రూ.500 లకే గ్యాస్, మహిళలకు రూ.2500 భృతి, రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ అనే అంశాలు జనాల్లోకి బాగా వెళ్లాయి. అవే ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చేలా చేసాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఇప్పుడు ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో వైసీపీ తో పాటు టిడిపి – జనసేన లు సైతం హామీలపై కసరత్తులు చేస్తున్నాయి. ఇప్పటీకే చంద్రబాబు మహిళలకు ఫ్రీ ఆర్టీసీ సౌకర్యం (Free Bus Travel Scheme) , ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అనే హామీలు బయటపెట్టగా..వారికంటే ముందే జగన్..మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని అందించేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. వీలైతే దీన్ని వచ్చే సంక్రాంతి నుంచి అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారులు రహస్యంగా అధ్యయనం చేస్తున్నారని టాక్. వివిధ రాష్ట్రాల్లో ఈ పథకం ఎలా అమలు అవుతుంది…? ఏ ఏ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు…? దీని వల్ల ప్రజల ఏమనుకుంటున్నారు…? ఆర్టీసీకి ఎంత నష్టం వస్తుంది..? ఆ లోటు పూడ్చటానికి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి..? ఇలా అన్నింటిపై జగన్ సర్వే చేస్తున్నారట. అంతే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వాళ్లు ఎంతమంది ఉన్నారు…? వారిలో మహిళలు ఎంతమంది ఉంటారు…? విద్యార్థులు ఎంతమంది ఉంటారు..? ఇలా అన్ని వివరాలను అధికారులు తీసుకుంటున్నారు.. మరి ఫైనల్ గా జగన్ ఏం డిసైడ్ చేస్తాడో చూడాలి.

తెలంగాణ లో ఇప్పటికే ఈ పథకం ఫై విమర్శలు వస్తున్నాయి. ఎక్కువగా సంఖ్యలో మహిళలు బస్సు ప్రయాణం చేయడం వల్ల, మగవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫ్రీ గా ఆడవారు సీట్లలో కూర్చుని పోతుంటే..మీము నిల్చుని పోవాల్సి వస్తుందని వారంతా వాపోతున్నారు. అలాగే ఆటో , క్యాబ్స్ ఇలా పలు వాహనదారులు ఫ్రీ పథకం వల్ల మీము తీవ్రంగా నష్టపోతున్నామని , ఆటో నడుపుతూ..బ్రతికే మాకు ఈ పథకం రోడ్డున పడేసిందని వాపోతున్నారు. మరి ఇవ్వన్నీ జగన్ చేసుకుంటాడో లేదో చూడాలి.

Read Also : Bank Holidays: 2024 జనవరిలో బ్యాంకు సెలవులు ఇవే..!

  Last Updated: 23 Dec 2023, 01:18 PM IST