Site icon HashtagU Telugu

Free Bus Travel: గుడ్ న్యూస్‌.. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం!

Free Bus Travel

Free Bus Travel

Free Bus Travel: ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ (Free Bus Travel) సదుపాయం కల్పించేందుకు ‘సీ’స్త్రీ శక్తి’ అనే కొత్త పథకాన్ని ఆగస్టు 15 నుంచి ప్రారంభించనున్నట్లు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. ఈ పథకం ద్వారా మహిళలు రాష్ట్రంలో ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.

పథకం వివరాలు

Also Read: Sara Tendulkar: ఆస్ట్రేలియా బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా సారా టెండూల్క‌ర్‌!

ప్రభుత్వంపై ఆర్థిక భారం

మహిళల ప్రయాణానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ పథకం అమలు కోసం ఏడాదికి సుమారు రూ. 1,950 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మహిళా సాధికారత, వారి ఆర్థిక భారాన్ని తగ్గించాలనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి వివరించారు.

రాజకీయంగా, సామాజికంగా ప్రాధాన్యత

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం రాజకీయంగా, సామాజికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాల మాదిరిగానే ఏపీ ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాన్ని ప్రారంభించడంపై ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోంది. ఈ పథకం మహిళల కదలికలను సులభతరం చేయడమే కాకుండా, వారి ఆర్థిక స్వాతంత్ర్యానికి కూడా దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ పథకం అమలుకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు, విధివిధానాలను ప్రభుత్వం త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.