Site icon HashtagU Telugu

AP Free Bus Scheme: మహిళలకు ఉచిత బస్సు పథకం.. కర్ణాటకలో ఏపీ మంత్రుల పర్యటన…

Ap Free Bus Scheme

Ap Free Bus Scheme

AP Free Bus Scheme: మహిళలకు ఉచిత బస్సు పథకం పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తున్నది. ఈ క్రమంలో ఉపసంఘం సభ్యులు కర్ణాటక రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి సహా స్థానిక అధికారులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా, బెంగళూరులో ఏపీ మంత్రులు రాంప్రసాద్‌రెడ్డి, అనిత, సంధ్యారాణి కర్ణాటక మంత్రి రామలింగారెడ్డిను కలిశారు. అక్కడ ఉచిత బస్సు ప్రయాణం పై ఆ రాష్ట్రంలో అమలవుతున్న విధానాలను సమీక్షించారు.

కర్ణాటక బస్సుల్లో ప్రయాణిస్తూ, మంత్రుల కమిటీ ప్రయాణ విధానాలు, సేవల అమలు, ఫలితాలు వంటి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకుంది.

ఏపీలో కూడా ఈ పథకాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కర్ణాటక యొక్క అనుభవాలను పరిశీలించి, తన రాష్ట్రంలో తగిన మార్గదర్శకాలను రూపొందించాలనుకుంటోంది.