Site icon HashtagU Telugu

Free Bus in AP : ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఫ్రీ బస్ – మంత్రి ప్రకటన

Free Bus

Free Bus

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం(Free Bus Travel to Women) అమలు తేదీని ఏపీ మంత్రి ప్రసాద్‌ రెడ్డి (ap minister anagani satya prasad) సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఎత్తున హామీలు ప్రకటించి కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్నికల హామీలను అమలు చేసే పక్రియ మొదలుపెట్టింది. ఇప్పటికే ఇసుక ఫ్రీ గా ఇవ్వడం స్టార్ట్ చేసింది..అలాగే జూలై నెల నుంచి పెంచిన పెన్షన్లను అందించింది. ఇక అసలైన పథకం కోసం రాష్ట్ర మహిళలంతా ఎదురుచూస్తున్నారు. అవును అదే ఫ్రీ బస్సు సౌకర్యం. ఇప్పటికే పక్క రాష్ట్రాలైన తెలంగాణ , కర్ణాటక లో ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాలు అందుబాటులోకి తీసుకొచ్చి సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నాయి. ఈ తరుణంలో ఏపీలో కూడా త్వరగా ఈ పథకాన్ని అమలు చేస్తే బాగుండని రాష్ట్రంలోని మహిళలంతా ఎదురుచూస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇటు ప్రభుత్వం కూడా దీనిపై కసరత్తులు మొదలుపెట్టింది. ఈ పథకం అమల్లోకి వస్తే ఎలాంటి ఇబ్బందులు , లాభాలు , నష్టాలూ వంటివి అధ్యనం చేస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో మంత్రి ప్రసాద్ ఈ పథకం అమలు ఫై ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసారు. ఆగస్టు 15 వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత బస్సు పథకాన్ని ప్రారభించబోతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన తో రాష్ట్ర మహిళలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మూతపడిన అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15 వ తేదీన ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈ మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా అదే రోజు మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఇలా వరుసగా హామీలు నెరవేరుస్తుండడం తో ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Bajaj Freedom CNG: బ‌జాజ్ సీఎన్‌జీ బైక్ మైలేజీ ఎంత..? ఒక కిలో సీఎన్‌జీతో 100 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించ‌లేమా..?