Police Alert : క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. బహుమతుల పేరుతో వచ్చే నకిలీ లింకులను క్లిక్ చేస్తే మీ బ్యాంకు వివరాలు, డబ్బులు కొట్టేసే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పద లింకులు, యాప్‌లను నమ్మవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని సూచిస్తున్నారు. మోసపోతే వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు. ఈ మేరకు పలు కీలక సూచనలు చేశారు పోలీసులు.
- క్రిస్మస్, న్యూ ఇయర్ పండగల పేరుతో మోసాలు
- గిఫ్ట్‌లు, ఆఫర్ల పేరుతో మోసాలు జరిగే ఛాన్స్
- జాగ్రత్తగా ఉండాలని పోలీసుల హెచ్చరికలు
ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్, న్యూ ఇయర్ సందడి కనిపిస్తోంది.. మనదేశం, తెలుగు రాష్ట్రాల్లో కూడా పండగ మూడ్ కనిపిస్తోంది. క్రిస్మస్, నూతన సంవత్సరం కావడంతో గిఫ్ట్‌లకు డిమాండ్ ఉంటుంది. ఇదే అదనుగా సైబర్ కేటుగాళ్లు కూడా రెచ్చిపోయే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. ఒకవేళ గిఫ్ట్‌ల పేరుతో వచ్చే లింకుల్ని నమ్మొద్దని హెచ్చరిస్తున్నారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. పండుగ సీజన్ కావడంతో ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్లలో డిస్కౌంట్లు ఉంటాయని.. సైబర్ కేటుగాళ్లు కూడా ఇదే పేరు చెప్పి మోసాలు చేస్తారంటున్నారు.
సైబర్ నేరగాళ్లు క్రిస్మస్, న్యూఇయర్ గిఫ్ట్‌ల పేరుతో సోషల్ మీడియాలో నకిలీ లింకులు పంపిస్తున్నారని హెచ్చరిస్తున్నారు. గిఫ్ట్ కార్డ్ గెలుచుకున్నారని, ఆఫర్‌ను క్లెయిమ్ చేసుకోవాలని చెబుతారని.. అలాంటి మెసేజ్‌లను నమ్మొద్దని సూచించారు. ఈ లింకులను క్లిక్ చేస్తే మొబైల్, బ్యాంకు వివరాలతో డబ్బులు కొట్టేస్తారంటున్నారు. ఒకవేళ సైబర్ నేరం జరిగితే డబ్బును దొంగిలిస్తారన్నారు. ఒకవేళ సైబర్ నేరం జరిగితే వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. అంతేకాదు హెల్ప్‌లైన్ నంబర్ 1930కు కాల్ చేయడం.. అలాగే సైబర్ వెబ్‌సైట్‌లో కూడా ఫిర్యాదు చేయలాంటున్నారు.
పండుగల సమయంలో ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని.. పొరపాటున కూడా తెలియని లింకులను క్లిక్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు. అలాగే సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతుంటారని.. అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం అంటున్నారు. వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని.. మరీ ముఖ్యంగా బ్యాంకు ఖాతా వివరాలు, OTP వంటివి రహస్యంగా ఉంచుకోవాలని సూచించారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింకుల్ని క్లిక్చేయొద్దని.. అనుమానాస్పద ఏపీకే ఫైల్స్ కూడా డౌన్‌లోడ్ చేయొద్దు.. పాన్‌కార్డు నంబర్, ఫొటోలు, బ్యాంకు అకౌంట్ వివరాలు, ఓటీపీలు, ఇతర వ్యక్తిగత సమాచారం ఎవరితో షేర్ చేయొద్దంటున్నారు. అలాగే అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దని, తెలియని యాప్‌లు ఇన్‌స్టాల్ చేయవద్దని, బెదిరింపు కాల్స్ వచ్చిన వెంటనే కాల్ కట్ చేసి కుటుంబ సభ్యులు, బ్యాంక్ లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
