Site icon HashtagU Telugu

Tragic Incident : బాపట్లలో సరదా ఈత..ప్రాణాలు పోయేలా చేసింది

Four Youths Drowned In Rive

Four Youths Drowned In Rive

సమ్మర్ వచ్చిందంటే చాలు చిన్న , పెద్ద అంత కూడా ఈత కొట్టేందుకు ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. ఎండా వేడి తాపాన్ని తగ్గించుకునేందుకు సరదాగా ఈత కొడుతుంటారు. ఒక్కోసారి సరదా ఈత కాస్త విషాదాన్ని నింపుతుంటుంది. ఈత కొట్టేక్రమంలో అనుకోని ప్రమాదాల వల్ల పలువురి ప్రాణాలు పోతుంటాయి. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగగా..తాజాగా ఈరోజు బాపట్ల ( Bapatla )లో విషాదం చోటుచేసుకుంది. పట్టణ శివారు నల్లమడ వాగులో ఈత కొట్టడానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన నలుగురు యువకుల్లో ఇద్దరి మృతదేహాలు బయటపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది గాలింపు చేపట్టి ఇద్దరి మృతదేహాలను వెలికితీసింది. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన ఆరుగురు యువకులు విహారయాత్ర కోసం బుధవారం ఉదయం సూర్యలంక బీచ్‌కు వచ్చారు. బీచ్‌లో ఎంజాయ్ చేసిన యువకులు.. ఆ తర్వాత హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు. అయితే తిరిగి వెళ్తున్న క్రమంలోనే బాపట్ల పట్టణం శివార్లలోనే ఉన్న నల్లమడ వాగులో ఈత కోసం దిగారు. అయితే లోతు ఎక్కువగా ఉండటం.. నీరు వేగంగా ప్రవహిస్తూ ఉండటంతో ఓ యువకుడు వాగులో కొట్టుకుపోయాడు. అయితే స్నేహితుణ్ని కాపాడే ప్రయత్నంలో.. మిగతా ముగ్గురు గల్లంతైనట్లు తెలిసింది. తమ బిడ్డలను ఎలాగైనా రక్షించాలని పోలీసులను యువకుల తల్లిదండ్రులు ప్రాధేయపడ్డారు. గల్లంతైన వారు సన్నీ, సునీల్, గిరి, నందుగా గుర్తించారు.

Read Also : Pinnelli : ‘పిన్నెల్లి పైశాచికం’ పుస్తకం విడుదల చేసిన టీడీపీ