Site icon HashtagU Telugu

AP High Court : 30కు చేరిన ఏపీ న్యాయమూర్తుల సంఖ్య

Four New Judges Of Ap High

Four New Judges Of Ap High

ఏపీ న్యాయమూర్తుల (AP judges) సంఖ్య 30 కి చేరింది. ఈరోజు ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా కొత్తగా నలుగురు ప్రమాణస్వీకారం చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నూతన న్యాయమూర్తులుగా హరినాథ్‌ నూనెపల్లి, కనపర్తి కిరణ్మయి, జగడం సుమతి, న్యాపతి విజయ్‌ లతో ఏపీ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణం స్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ (CM Jagan), గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఏపీ హైకోర్టు ఛీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, హోం మంత్రి తానేటి వనిత, మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు.

న్యాయవాదుల కోటా నుంచి ఈ నలుగురిని న్యాయమూర్తులుగా నియమించాలని ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీంతో కేంద్ర న్యాయ శాఖ వీరి నియామకానికి ఈ నెల 18న ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులకు ప్రస్తుతం 27 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఇద్దరు ఇతర రాష్ట్రాలకు బదిలీ కాగా, కర్ణాటక నుంచి జస్టిస్ నరేందర్ బదిలీపై ఏపీ హైకోర్టుకు వస్తున్నారు. కొత్తగా నియమితులైన వారితో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కు చేరింది.

Read Also : KCR : కేసీఆర్ వెనుకుండి నడిపిస్తున్నారా..?