Nandigam Suresh : వైఎస్సార్ సీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను ఏపీ పోలీసులు గురువారం ఉదయం హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అనంతరం మంగళగిరి తరలించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయనతో పాటు మరికొందరు వైఎస్సార్ సీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. వీటిలో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ఇటీవలే కొట్టేసింది. దీంతో సురేశ్‌ను అరెస్టు చేసేందుకు బుధవారం ఉదయం ఉద్దండరాయునిపాలెంలోని నందిగం సురేశ్ ఇంటికి తుళ్లూరు పోలీసులు వెళ్లారు.
We’re now on WhatsApp. Click to Join
సురేశ్(Nandigam Suresh) అక్కడ లేరని, అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయి సెల్‌ఫోన్ స్విచాఫ్ చేశారని గుర్తించారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ మొదలుపెట్టిన మంగళగిరి రూరల్ పోలీసులు.. ఆయన హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. పక్కా సమాచారంతో నగరంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సురేష్‌ను గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. అనంతరం కోర్టులో ప్రవేశపెడతారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైఎస్సార్ సీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురామ్ సహా పలువురు ప్రస్తుతం అజ్ఞాతంలోనే ఉన్నారు. వారి కోసం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పోలీసులతో కలిపి 12 టీమ్స్ గాలిస్తున్నాయి.
Also Read :Teacher’s Day 2024: 82 మంది ఉపాధ్యాయులను సన్మానించనున్న రాష్ట్రపతి
యుద్ధ ప్రాతిపదికన బుడమేరు గండ్లను పూడ్చే పనులు
బుడమేరు వరద ముంపు విజయవాడను అతలాకుతలం చేసింది. అది మెల్లగా తొలగిపోతోంది. దీంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన బుడమేరు గండ్లను పూడ్చే పనులు చేయిస్తున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి మరీ ఈ పనులు చేయిస్తున్నారు. బుడమేరకు వరద వచ్చే అవకాశమున్నందున వేగంగా ఈ పనులను క్లియర్ చేయడంపై ఫోకస్ పెట్టారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు ఎప్పటికప్పుడు బుడమేరు గండ్ల పూడిక పనుల గురించి తెలుసుకుంటూ ఆదేశాలు ఇస్తున్నారు. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 3454 మంది కార్మికులతోపాటు 450 మంది ప్రజారోగ్య సిబ్బందిని ఈ పనులకు వినియోగిస్తున్నారు. వీరితోపాటు ఇతర మున్సిపాలిటీల నుంచి వచ్చిన 5889 మంది కార్మికులను రంగంలోకి దించారు.