Site icon HashtagU Telugu

YSRCP : హిందూపురం వైసీపీ ఎంపీ అభ్య‌ర్థిగా బ‌ళ్లారి మాజీ ఎంపీ

Hindupuram YSRCP

Hindupuram YSRCP

వైసీపీ టికెట్ల ప్ర‌క‌ట‌న విష‌యంలో దూకుడు ప్ర‌దర్శిస్తుంది. మొద‌టి, రెండో జాబితాలో మొత్తం 38 మంది అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది. ఇందులో పార్ల‌మెంట్ అభ్య‌ర్థుల‌ను కూడా వైసీపీ ప్ర‌క‌టించింది. రెండో జాబితాలో హిందూపురం వైసీపీ అభ్య‌ర్థిని వైసీపీ అధిష్టానం ప్ర‌క‌టించింది. కర్ణాటకలోని బళ్లారి మాజీ ఎంపీ శాంతను హిందూపురం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు. ఈమె అనంతపురం జిల్లా గుంతకల్‌కు చెందిన వారు. నిన్న ఆమె వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో పార్టీలో చేరారు. అదే రోజు ఆమెను హిందూపురం ఎంపీ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు. మాజీ ఎంపీ శాంత .. మైనింగ్ కింగ్ గాలి జనార్ధన రెడ్డికి సన్నిహితుడైన బీజేపీ మాజీ మంత్రి శ్రీరాములు సోదరి.

We’re now on WhatsApp. Click to Join.

బోయ సామాజిక‌వ‌ర్గానికి చెందిన శాంత‌ను హిందూపురం అభ్య‌ర్థిగా పోటీ చేస్తే ఆ సామాజిక‌వ‌ర్గానికి ప్రాధాన్య‌త ఇచ్చిన‌ట్లు ఉంటుంద‌ని అధిష్టానం భావించింది. హిందూపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాలు టీడీపీకి కంచుకోటలుగా ఉన్నాయి. టీడీపీని వెనక్కి నెట్టేందుకు వైఎస్సార్‌సీపీ ఉవ్విళ్లూరుతోంది. వచ్చే ఎన్నికల వ్యూహంలో భాగంగా సిట్టింగ్ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు హిందూపూర్ నియోజకవర్గం నుంచి టికెట్ నిరాకరించి బోయ సామాజికవర్గానికి చెందిన మహిళా అభ్యర్థిని బరిలోకి దింపింది. శాంత 2009 లోక్‌సభ ఎన్నికలలో బళ్లారి నుండి బిజెపి ఎంపిగా ఎన్నికయ్యారు, అయితే సిట్టింగ్ ఎంపి శ్రీరాములు ఎమ్మెల్యేగా పోటీ చేసి రాజీనామా చేయడంతో ఎన్నిక జరిగినప్పుడు బళ్లారిలో 2018 ఉపఎన్నికలలో ఓటమిని ఎదుర్కొన్నారు.తాను పార్టీ కార్యకర్తగా పనిచేస్తానని.. త‌న‌కు అప్పగించిన ప‌నుల‌ను నిర్వ‌ర్తిస్తాన‌ని ఆమె తెలిపారు.

Also Read:  TTD : వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా తిరుమ‌ల శ్రీవారికి భారీగా హుండీ ఆదాయం

Exit mobile version