Former MP Kanakamedala Ravindra Kumar : జగన్ కు కనకమేడల సూటి ప్రశ్న

సీఎం జగన్ గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారని.. మేనిఫెస్టోలో (Manifesto) చెప్పినట్టుగా హామీలు 99 శాతం పూర్తి చేశామని చెపుతున్నారు.. నిజంగా 99 హామీలు పూర్తి చేశారా అని ప్రశ్నించారు

Published By: HashtagU Telugu Desk
Kanakamedala Ravindra Kumar

Kanakamedala Ravindra Kumar

ఏపీలో ఎన్నికలకు ఇంకా 15 రోజుల సమయం మాత్రమే ఉండడం తో అన్ని రాజకీయ పార్టీలు తమ తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా కూటమి నేతలు ప్రచారంలో దూకుడు కనపరుస్తున్నారు. ఇదే సందర్బంగా పలువురు నేతలు వైసీపీ తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కనకమేడల రవీంద్రకుమార్ (Former MP Kanakamedala Ravindra Kumar) తీవ్ర విమర్శలు చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

సీఎం జగన్ గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారని.. మేనిఫెస్టోలో (Manifesto) చెప్పినట్టుగా హామీలు 99 శాతం పూర్తి చేశామని చెపుతున్నారు.. నిజంగా 99 హామీలు పూర్తి చేశారా అని ప్రశ్నించారు. అభివృద్ధి సంక్షేమాన్ని పక్కకు పెట్టి జగన్ కాలయాపన చేసారని, 25 మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని అన్నారని.. ప్రత్యేక హోదా కోసం మెడలు వంచుతామని అన్నారని.. అది ఏమైందని… ఎవరు ఎవరి దగ్గర మెడలు వంచారని నిలదీశారు.

జగన్ మోసపూరిత హామీలు ఇచ్చారన్నారు. మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చారు..ఆ హామీ ఏమైందని ప్రశ్న వేశారు. కల్తీమద్యం సరఫరా చేసి ఎంతోమంది చావుకు కారణమయ్యారు..కరెంట్ రేట్లు 9 సార్లు పెంచారు.. అన్నా క్యాంటీన్ ఎత్తేశారని.. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తగ్గించారు. సంపద సృష్టికి ఏమైనా ఆలోచన చేశారా అని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి కొరకు చంద్రబాబు ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నారని వివరించారు. వాస్తవాలకు భిన్నంగా జగన్ పచ్చి అబ్దాలు మాట్లాడుతున్నారన్నారు.

Read Also : Ram Charan : రామ్ చరణ్ RC16 షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట..

  Last Updated: 29 Apr 2024, 03:39 PM IST