Former Minister Rajini: వైసీపీ మాజీ మంత్రికి మరో బిగ్ షాక్!

ఏపీ మాజీ మంత్రి విడదల రజిని మరిది విడదల గోపిని ఏసీబీ అధికారులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.

Published By: HashtagU Telugu Desk
Former Minister Rajini

Former Minister Rajini

Former Minister Rajini: ఏపీ మాజీ మంత్రి విడదల రజిని (Former Minister Rajini) మరిది విడదల గోపిని ఏసీబీ అధికారులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. యడ్లపాడు మండలం, పల్నాడు జిల్లాలోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించి రూ. 2.2 కోట్లు వసూలు చేసిన కేసులో గోపిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి విడదల రజిని ప్రధాన నిందితురాలు (A1), గోపి (A3), సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారి పల్లె జోషువా (A2), రజిని పీఏ దొడ్డ రామకృష్ణ (A4) నిందితులుగా ఉన్నారు.

యజమాని నల్లపనేని చలపతి రావు ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం దర్యాప్తు చేసి, రజినికి రూ. 2 కోట్లు, జోషువా, రామకృష్ణలకు తలా రూ. 10 లక్షలు చెల్లించినట్లు నిర్ధారించింది. గోపిని విజయవాడకు తరలిస్తున్నారు. రజిని ఈ ఆరోపణలను రాజకీయ కక్షతో కూడినవని గతంలో ఖండించింది, టీడీపీ ఎంపీ లవు శ్రీకృష్ణ దేవరాయలు వ్యక్తిగత కోపంతో ఈ కేసు రాజకీయంగా ప్రేరేపితమని ఆరోపించింది.

Also Read: Mosquitoes Bite: షాకింగ్ రిపోర్ట్.. ఏ బ్లడ్ గ్రూప్ వారిని దోమలు ఎక్కువగా కుడ‌తాయి?

కేసు వివరాలు

పల్నాడు జిల్లా, యడ్లపాడు మండలం, కంద్రిక గ్రామంలోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానుల నుండి రూ. 2.2 కోట్లు దోపిడీ చేసిన ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో విడదల రజిని ప్రధాన నిందితురాలు (A1), సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారి పల్లె జోషువా (A2), రజిని మరిది గోపి (A3), రజిని పీఏ దొడ్డ రామకృష్ణ (A4) నిందితులుగా ఉన్నారు. యజమాని నల్లపనేని చలపతి రావు ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం దర్యాప్తు చేసింది. ఏసీబీ గోపిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి, విజయవాడకు తరలించింది. ఈ కేసు విచారణలో భాగంగా అధికారులు క్రషర్ యూనిట్‌ను సందర్శించిన అధికారులను ప్రశ్నిస్తున్నారు.

  Last Updated: 24 Apr 2025, 09:53 AM IST