Site icon HashtagU Telugu

Floods: జగనన్న సంస్కరణలే వరద కష్టాల నుండి ప్రజలను గట్టెక్కిస్తున్నాయి: రోజా

Opposition to RK Roja from his own party leaders

Former minister Roja comments on ap govt

Vijayawada Floods: నేడ విజయవాడలో మంత్రులు ఇంటింటికీ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గతంలో జగన్ (jagan) తీసుకువచ్చిన రేషన్ వాహనాలు ఈ కార్యక్రమలో పాలుపంచుకుంటున్నాయి. అయితే దీనిపై వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా స్పందించారు. ” జగనన్న తీసుకువచ్చిన రేషన్ వాహనాలు, జగనన్న తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థ, జగనన్న నియమించిన వాలంటీర్ వ్యవస్థ, జగనన్న కట్టించిన రిటైనింగ్ వాల్, జగనన్న హయాంలో కొన్న 108, 104 వాహనాలు, జగనన్న నియమించిన సచివాలయ ఉద్యోగులు, జగనన్న తీసుకువచ్చిన క్లీన్ ఆంధ్ర వాహనాలు, జగనన్న తీసుకువచ్చిన వైఎస్ఆర్ హెల్త్ సెంటర్లు.. ఈరోజు వరద కష్టాల నుండి విజయవాడ ప్రజలను గట్టెక్కిస్తున్నాయి” అని ట్వీట్ చేశారు.

రాష్ట్ర రాజకీయాలలో మళ్ళీ రోజా యాక్టివ్..

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, ఫలితాల అనంతరం కొంతకాలం కనిపించకుండా పోయిన మాజీ మంత్రి రోజా.. గత కొద్ది రోజులుగా తిరిగి రాష్ట్ర రాజకీయాలలో మళ్ళీ యాక్టివ్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై తరచూ విమర్శలు చేస్తున్నారు. ఇటీవల కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడం లేదని నిలదీశారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు షో చేయడం తప్ప వరద బాధితులను ఆదుకునేందుకు ప్రయత్నం చేయడం లేదని మండిపడ్డారు. తాజాగా తన ఎక్స్ (ట్విట్టర్ ) ద్వారా వరదల బారిన పడ్డ విజయవాడ ప్రజలను ఉద్దేశిస్తూ, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ని పొగుడుతూ ఆమె ఈ  ట్వీట్ చేశారు.

Read Also: Fruits: పరగడుపున ఈ పండ్లు తింటే చాలు.. ఆ సమస్యలన్నీ దూరం!