Site icon HashtagU Telugu

AP: అపోలో ఆసుపత్రిలో చేరిన మాజీమంత్రి కొడాలి నాని..ప్రస్తుతం ఆయన.!!

kodali nani

kodali nani

ఏపీ మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆసుపత్రిలో చేరారు. హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. నానికి కిడ్నీల్లో రాళ్లు చేయడంతో చికిత్స పొందుతున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. మూడు రోజులుగా నాని ఆసుపత్రిలోనే ఉన్నారు. మూడురోజులుగా వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తారు. శుక్రవారం రాత్రి ఆపరేషన్ జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం నాని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని ఆయన సన్నిహితులు తెలిపారు.

ఇక శస్త్ర చికిత్స జరిగింది కాబట్టి రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని నానికి వైద్యులు సూచించారట. 15రోజుల తర్వాత మరోసారి ఆయనకు కిడ్నీ సంబంధిత లేజర్ ట్రీట్ మెంట్ చేస్తారని సమాచారం.