Site icon HashtagU Telugu

Jawahar Reddy : ఏపీ మాజీ సీఎస్ జవహర్ రెడ్డికి సెలవు మంజూరు

Cs Jawahar Reddy

Cs Jawahar Reddy

ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి (Jawahar Reddy)కి ఈనెల 7వ తేదీ నుండి 27వ తేదీ వరకూ అనగా 21 రోజుల పాటు ఆర్జిత సెలవు(Earned Leave) మంజూరు అయింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ జిఓఆర్టీ సంఖ్య 1058 ద్వారా ఏపీ ప్రభుత్వ కొత్త సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కెఎస్.జవహర్ రెడ్డి ఆర్జిత సెలవు మంజూరు చేయాల్సిందిగా గురువారం (జూన్ 6న) ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో అఖిల భారత లీవ్ రూల్స్ 1955 ప్రకారం ఆర్జిత సెలవు మంజూరు చేస్తూ కొత్త సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక జవహర్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ కార్యకర్తగా విధులు నిర్వర్తించడం, విశాఖ అసైన్డ్ భూముల కుంభకోణంలో కూరుకుపోవడంతో కొత్త ప్రభుత్వం ఆయనను సెలవులో పంపించింది. ఆయన చేతుల మీదుగా ప్రమాణస్వీకారం చేయడానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు విముఖత వ్యక్తం చేయడంతో ఆయనను గవర్నర్ కార్యాలయం సెలవులో పంపించిందని ప్రచారం జరుగుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే జవహర్ రెడ్డిపై విచారణకు ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Also : Manne Krishank: తెలంగాణ రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని ప్రవేశ పెట్టొద్దు