Leopard : చిరుత అనుమానాస్ప‌ద మృతి…ఆ కోణంలో ద‌ర్యాప్తు చేస్తున్న అధికారులు…?

పుంగనూరు పరిధిలోని పెద్దపంజాణి మండలంలో చిరుత‌పులి అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందింది.

  • Written By:
  • Publish Date - December 1, 2021 / 10:39 AM IST

పుంగనూరు పరిధిలోని పెద్దపంజాణి మండలంలో చిరుత‌పులి అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందింది. అయితే చిరుత‌పులి మృతికి సంబంధించి అట‌వీశాఖ అధికారుల‌కు ఎలాంటి ఆధారాలు ల‌భించ‌లేదు. సోమవారం సాయంత్రం ముళ్ల పొదల మధ్య చిరుత కళేబరం లభ్యమైంది. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ (ఎస్‌వీవీయూ)కు చెందిన పశువైద్యుల బృందం మంగళవారం చిరుతపులి కాళేభరానికి పోస్ట్‌మార్టం నిర్వహించి, దహనం చేయడానికి ముందు ఫోరెన్సిక్ పరీక్షల కోసం దాని శ‌రీర భాగాల‌ను నుంచి శాంపిల్స్ సేక‌రించారు.

డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (చిత్తూరు వెస్ట్) ఎస్.రవిశంకర్ పుంగనూరు, పలమనేరు రేంజ్ అధికారులతో కలిసి ఘ‌ట‌నా స్థలాన్ని సందర్శించారు. చిరుత‌పులికి బ‌య‌ట ఎలాంటి గాయాలే క‌నిపించ‌లేద‌ని..వ‌ల పెట్టిన‌ట్లు కూడా ఎక్క‌డా క‌నిపించ‌లేద‌ని అధికారులు తెలిపారు.అడ‌విలో నీరు పుష్క‌లంగా ల‌భింస్తుంది. అయితే చిరుత పులికి విషం క‌లిగిన ఆహారం ఎమైనా తిని ఉంటుంద‌ని అధికారులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదికి వ‌చ్చిన త‌రువాత చిరుత పులి మృతికి కార‌ణాలు తెలుస్తాయ‌ని అంటున్నారు.

గుత్తివారిపల్లె పంచాయతీ పరిధిలోని అటవీ సరిహద్దు ప్రాంతాల్లో నెల రోజులుగా చిరుతపులి తిరుగుతూ వీధికుక్కల కోసం గాలిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. చిరుతపులి సంచరిస్తుందనే భయంతో కొంతమంది నివాసితులు తమ పశువులను తమ ఇళ్లలో దాచుకోవాల్సి వచ్చింది, నవంబర్ నెలలో ఈ ప్రాంతంలో వర్షాలు కురుస్తుండటంతో వారు చాలా అసౌకర్యానికి గురయ్యారు. దీంతో అటవీశాఖ అధికారులు చిరుత పులికి గ్రామ‌స్తులు ఎవ‌రైన విషం పెట్టి ఉంటార‌నే కోణంలో అనుమానిస్తున్నారు.