FMGE Scam : ఏపీ, తెలంగాణాల్లో విదేశీ మెడిక‌ల్ ప‌రీక్ష కుంభ‌కోణం

విజ‌య‌వాడ‌, వ‌రంగ‌ల్ కేంద్రంగా జ‌రిగిన విదేశీ మెడిక‌ల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేష‌న్ (FMGE)

  • Written By:
  • Updated On - December 29, 2022 / 05:18 PM IST

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో జ‌రిగిన విదేశీ మెడిక‌ల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేష‌న్ (FMGE) అక్ర‌మాల భాగోతాన్ని సీబీఐ(CBI) బ‌య‌ట పెట్టింది. విజ‌య‌వాడ‌, వ‌రంగ‌ల్ కేంద్రంగా జ‌రిగిన న‌కిలీ లైసెన్స్ స‌ర్టిఫికేట్ల వ్య‌వ‌హారాన్ని ర‌ట్టు చేసింది. ఎఫ్‌ఎంఈజీ (FMGE) పరీక్షకు సంబంధించిన నకిలీ పాస్ సర్టిఫికెట్‌తో సహా పలు అభ్యంతరకర పత్రాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. స్టేట్ మెడికల్ కౌన్సిల్స్ మరియు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (MCI)కి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, 73 మంది విద్యార్థులు క‌లిసి ఈ (FMGE) అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్టు గుర్తించింది. వాళ్ల మీద కేసులు న‌మోదు చేసింది.

ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ల పరీక్షకు 

దేశ వ్యాప్తంగా జరిగిన పరీక్ష‌ కుంభ‌కోణం మూలాల‌ను సీబీఐ బ‌య‌ట‌కు తీస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని 91 ప్రాంతాల్లో దాడులు చేసింది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS)) నిర్వహించిన క్వాలిఫైయింగ్ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ల పరీక్షకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లను సృష్టించారు. వాటి ఆధారంగా అనేక రాష్ట్రాల్లోని మెడికల్ కౌన్సిల్‌లలో విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్లు లైసెన్స్ కోసం నమోదు చేసుకున్నారు. కొంద‌రు ఇప్పుడు ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. ఆ విష‌యాన్ని తెలుసుకున్న సీబీఐ(CBI) దేశ వ్యాప్తంగా 91 చోట్ల దాడులు చేసింది.

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) గురువారం దేశవ్యాప్తంగా 91 చోట్ల చేసిన దాడులు నివ్వెర‌ప‌రిచే అక్ర‌మాలు బ‌య‌ట‌పడ్డాయి. ఆయా ప్రాంతాల్లో ఎఫ్‌ఎంఈజీ పరీక్షకు సంబంధించిన నకిలీ పాస్ సర్టిఫికెట్ ల‌తో పాటు పలు అభ్యంతరకర పత్రాలను స్వాధీనం చేసుకుంది. స్టేట్ మెడికల్ కౌన్సిల్స్ మరియు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (MCI)కి చెందిన కొంద‌రు ప్రభుత్వ ఉద్యోగులు, 73 మంది విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్లతో పాటు బ్రోకర్ల మీద CBI కేసు నమోదు చేసింది.

Also Read : PG medical seats: గుడ్ న్యూస్.. భారీగా పెరిగిన పీజీ మెడికల్ సీట్లు..!

73 మంది విద్యార్థులు లైసెన్స్ స‌ర్టిఫికేట్

ప్రాథ‌మిక స‌మ‌చారం ప్ర‌కారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు 73 మంది విద్యార్థులు లైసెన్స్ స‌ర్టిఫికేట్  ను ఎంసీఐ నుంచి పొందిన‌ట్టు గుర్తించారు. వాటి ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో మెడికల్ కౌన్సిల్‌లో లైసెన్స్ నమోదు చేసుకున్నారు. నకిలీ లైసెన్స్ సర్టిఫికేట్‌లతో రిజిస్ట్రేష‌న్ నెంబ‌ర్ తీసుకున్న అభ్యర్థులు దేశవ్యాప్తంగా ప‌లుఆసుపత్రుల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. అలాగే, ప్ర‌భుత్వ ఉద్యోగాలు పొందడానికి అవ‌కాశం ఏర్ప‌డింది.

విజయవాడ, వరంగల్ , ఢిల్లీ, చండీగఢ్, అమృత్‌సర్, గురుదాస్‌పూర్, భటిండా, ఖన్నా, కర్నాల్, సవాయిమాధోపూర్, నర్వానా, హమీర్‌పూర్, సిమ్లా, జమ్ము, శ్రీనగర్, డెహ్రాడూన్, ఘజియాబాద్, గౌహతి, తేజ్‌పూర్, ఇంఫాల్, సిక్కిం, రాజ్‌పూర్, పాట్నా, ముంగేర్, ముంబై, జైపూర్, సికార్ , తిరునల్వేలి, మధురై, భోపాల్, నాగ్‌పూర్, బుల్దానా, పూణే, జల్గావ్, దర్భంగా, భాగల్‌పూర్, చంపారన్, బెగుసరాయ్, బొకారో, వైజాగ్, హాజీపూర్, వైశాలి, నలందలో సీబీఐ దాడులు చేసింది. దేశ వ్యాప్తంగా 91 ప్రాంతాల్లో చేసిన దాడుల్లో స్వాధీనం చేసుకున్న ప‌త్రాల ఆధారంగా
సీబీఐ తదుపరి విచారణ కొనసాగిస్తోంది.

ప్రైవేటు మెడిక‌ల్ కాలేజీల లాబీయింగ్ 

విదేశాల్లో ఎంబీబీఎస్ చ‌దివిన విద్యార్థులు భార‌త దేశంలో ప‌నిచేయాలంటే ఎంసీఐ నిర్వ‌హించే ఫారిన్ మెడిక‌ల్ గ్రాడ్యుయేట్ పరీక్ష‌(ఎఫ్ ఎంఈజీ) పాస్ కావాలి. లేదంటే ప్రాక్టీస్ చేయ‌డానికి అన‌ర్హులు. ఆ ఎగ్జామ్ ను ప్ర‌తి ఏడాది రెండుసార్లు ఎంసీఐ నిర్వ‌హిస్తోంది. చాలా కాలంగా ఈ ప‌రీక్ష అక్ర‌మాల గురించి విద్యార్థులు ఫిర్యాదులు చేశారు. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు రాజ‌కీయ పెద్ద‌లు ఎంసీఐలో చ‌క్రం తిప్పుతూ ఇంత‌కాలం గుట్టుగా న‌కిలీ భాగోతాన్న న‌డిపారు. ప‌రీక్ష రాసిన త‌రువాత క‌నీసం రీ వాల్యుష‌న్, రీ చెకింగ్ కు కూడా అవ‌కాశం లేకుండా ఆన్ లైన్ ఎగ్జామ్ ను పెడుతుంటారు. అత్య‌ధికంగా ఉత్తీర్ణ‌తా శాతం 18 కి మించి ఉండ‌దు. ఇలా ఉత్తీర్ణ‌తా శాతాన్ని త‌గ్గించ‌డానికి దేశంలోని ప్రైవేటు మెడిక‌ల్ కాలేజీల లాబీయింగ్ ఉంద‌ని ప‌లుమార్లు బ‌య‌ట ప‌డింది.

ఢిల్లీ కేంద్రంగా చేసుకుని ప‌లువురు ఎఫ్ ఎంజీ ప‌రీక్ష పాస్ చేయ‌డాని బ్రోక‌ర్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. క‌నీసం రూ. 3 నుంచి రూ. 5ల‌క్ష‌ల తీసుకుని పాస్ స‌ర్టిఫికేట్లు ఇస్తున్నారని స‌ర్వ‌త్రా వినిపించే ఆరోప‌ణ‌. ఈ దందా వెనుక కొంద‌రు ఎంపీలు కూడా ఉన్నార‌ని ఉత్తీర్ణ‌త సాధించ‌ని విద్యార్థుల్లో ఆందోళ‌న ఉంది. మ‌ధ్య‌వ‌ర్తులుగా వ్య‌వ‌హ‌రించే వాళ్ల ద్వారా న‌కిలీ స‌ర్టిఫికేట్ల‌ను పొందుతూ విదేశీ విద్యార్థులు చాలా ఏళ్లుగా లైసెన్స్ ను పొందారు. ప్ర‌త్యేకించి కోవిడ్ -19 సంద‌ర్భంగా గ‌త ఏడాది డిసెంబ‌ర్, ఈ ఏడాది జ‌న‌వ‌రి లోని ప‌రీక్షల సంద‌ర్భంగా న‌కిలీ స‌ర్టిఫికేట్ల భాగోతం ఎక్కువ అయింది. దీంతో సీబీఐ రంగంలోకి దిగింది. పారిన్ మెడిక‌ల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్ కుంభ‌కోణాన్ని బ‌య‌ట‌పెట్టింది.

Also Read : Fake Education Certificates : హైద‌రాబాద్‌లో ఫేక్ ఎడ్యూకేష‌న్ స‌ర్టిఫికేట్ల ముఠా అరెస్ట్‌

Hashtagu