Site icon HashtagU Telugu

Allu Arjun : ఓటు వేశాక.. ఎవరికి తన సపోర్టో చెప్పేసిన అల్లు అర్జున్

Allu Arjun

Allu Arjun

Allu Arjun : అల్లు అర్జున్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌కు సతీమణి స్నేహారెడ్డితో కలిసి వెళ్లి సోమవారం ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన సపోర్ట్ ఎవరికో స్పష్టం  చేశారు.

We’re now on WhatsApp. Click to Join

ఇటీవల నంద్యాల వైఎస్సార్ సీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతు ఇవ్వడంపై అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చారు. తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘‘ఎన్నికల్లో నేను రాజకీయ పార్టీని చూసి మద్దతు ఇవ్వను. నాకు ఎవరు సన్నిహితులుగా ఉంటారో వాళ్లకే మద్దతు ఇస్తాను. ఇందులో భాగంగానే వైఎస్సార్ సీపీ అభ్యర్థి శిల్పా రవికి సపోర్ట్ ఇచ్చాను. వాస్తవానికి గత ఎన్నికల టైంలోనే  శిల్పా రవిని కలుద్దామని అనుకున్నాను. కానీ కుదరలేదు. అందుకే ఈ సారి ఇంటికి వెళ్లి కలిశాను’’ అని నంద్యాల టూర్ గురించి అల్లు అర్జున్ వివరించారు.  పవన్ కల్యాణ్, బన్నీవాసు, తన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డిలకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. అధికారికంగా తాను ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధాలు పెట్టుకోనని తెలిపారు.

Also Read : Elections 2024 : ఓటువేసిన వెంకయ్యనాయుడు, జగన్, చంద్రబాబు, ఒవైసీ

శిల్పా రవిచంద్రారెడ్డికి అల్లు అర్జున్ ఎలా పరిచయం ?

వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి సతీమణి శిల్పా నాగిని రెడ్డి, అల్లు అర్జున్‌ సతీమణి స్నేహా రెడ్డి ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్లిద్దరూ క్లాస్‌‌మేట్స్‌ కూడా. అందుకే తరచూ బన్నీ, రవి కలుసుకునే వారు. ఆవిధంగా రవిచంద్రారెడ్డి, అల్లు అర్జున్‌ మంచి స్నేహితులయ్యారు. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాల్లో జరిగే వేడుకల్లోనూ పరస్పరం పాల్గొనేవారు. స్నేహానికి అత్యంత విలువ ఇచ్చే వ్యక్తి అల్లు అర్జున్‌ అని గతంలో ఓ ఇంటర్వ్యూలో రవిచంద్రారెడ్డి చెప్పారు. బన్నీ ఎప్పుడూ రాజకీయాల గురించి ఎంతో ఆసక్తిగా చర్చిస్తాడని రవిచంద్రారెడ్డి చెప్పుకొచ్చారు. ‘‘అల్లు అర్జున్ ఫ్యామిలీ వాళ్లు రాజకీయాల్లో ఉండటంతో అతన్ని ప్రచారానికి ఆహ్వానించాలని నేను అనుకోలేదు. అయినా స్నేహం కోసం అల్లు అర్జున్  నాకు మద్దతు తెలపడం సంతోషంగా ఉంది’’ అని రవిచంద్రారెడ్డి తెలిపారు.

Also Read :Phase 4 Elections : 96 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ షురూ.. ఓటర్లకు ప్రధాని మోడీ సందేశం