వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)..ఏపీ సర్కార్ (AP Govt) తన సూచన తెలియజేసారు. రాష్ట్రంలో కుక్కల బెడద (Dogs) ఎక్కువై పోతుంది..పెద్ద వారి దగ్గరి నుండి చిన్న పిల్లల వరకు ఎవర్ని వదిలిపెట్టకుండా దాడులు చేస్తున్నాయి. ముందు వాటి పై దృష్టి పెట్టండి..కేసుల ‘వాడి మీద కేసు పెడదాం. వీళ్లను బొక్కలో వేద్దాం. మొత్తాన్ని చితక్కొడదాం అని కాకుండా ఇలాంటి ఘోరాల మీద దృష్టి పెట్టండి ‘ అంటూ ట్వీట్ చేసారు.
ప్రస్తుతం ఏపీ సర్కార్ వైసీపీ నేతలపై , వైసీపీ సోషల్ మీడియా వర్గం పై ప్రత్యేక ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా కొంతమంది ఆడవారిపై , అధికార పార్టీ నేతలపై ఇష్టానుసారంగా పిచ్చి పిచ్చి రాతలు , అసభ్యకర పోస్టులు పెడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇది కొత్తగా ఇప్పుడు కాదు గత ఐదేళ్ల వైసీపీ హయాం నుండి ఇలాగే రెచ్చిపోతూ వస్తున్నారు. జగన్ అండ చూసుకొని మరింత రెచ్చిపోయారు. తమ స్థాయి కూడా మరచి చంద్రబాబు , పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఇలా అనేక మందిపై ఇష్టానుసారంగా మాట్లాడడం..బూతులు తిట్టడం వంటివి చేసారు. రాజకీయంగానే కాక వ్యక్తిగతంగా కూడా పోస్టులు పెట్టి బాధపెట్టారు. ఇదంతా కూడా తాడేపల్లి ఆఫీస్ నుండే చేసినట్లు పోలీసులు గుర్తించారు. అందుకే ఇలా పిచ్చి వాగుడు వాగినా వారినే కాకుండా పోస్టులు పెట్టిన వారిపై కూడా కూటమి సర్కార్ కేసులు పెట్టి అరెస్ట్ లు చేస్తుంది. దీంతో ఎవర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అనే భయంతో వైసీపీ శ్రేణులు వణికిపోతున్నారు. అందుకే అంబటి కేసులు మీద కాదు కుక్కల మీద దృష్టి పెట్టండి అంటూ ట్వీట్ చేసారు.
వాడి మీద కేసు పెడదాం
వీళ్ళని బొక్కలో వేద్దాం
మొత్తాన్ని చితక్కోడదాం
అనే వాటి మీద నుంచి దృష్టి
ఇలాంటి ఘోరాల మీద పెట్టండి!ఈ వార్త చదువుతుంటేనే
హృదయం ధ్రవిస్తుంది!@ncbn @naralokesh @PawanKalyan pic.twitter.com/rQRCtH5ef1— Ambati Rambabu (@AmbatiRambabu) November 12, 2024
Read Also : Reliance Industries : ఏపీలో రిలయన్స్ రూ.65వేల కోట్ల పెట్టుబడులు