Site icon HashtagU Telugu

AP Rains : విజయవాడ రైల్వే స్టేషన్‌ను ముంచెత్తిన వరద

Rayanapadu Railway Station

Rayanapadu Railway Station

అల్ప పీడన ప్రభావం తో ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ లో 30 ఏళ్ల రికార్డు బ్రేక్ అయ్యింది. శనివారం కుండపోత వర్షం కురవడం తో నగరంలో చాల కాలనీ లు వరదలో చిక్కుకున్నాయి. చాలా ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వర్షం పడినట్లు అధికారులు చెబుతున్నారు. ఆటోనగర్ నుంచి బెంజి సర్కిల్‌ వరకు వర్షపు నీరు నిలిచి ఉంది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆదివారం కూడా బెజవాడలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బెజవాడ గజగజ వణికిపోతోంది. అలాగే ఏలూరు నగరంలోని అనేక కాలనీలు నీట మునిగాయి. ఎక్కడ చూసినా వర్షపు నీరే కనిపిస్తోంది. ఇక విజయవాడ, గుంటూరు నగరాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడ చూసినా నాలుగైదు అడుగుల మేర నీరు నిలిచింది.

We’re now on WhatsApp. Click to Join.

విజయవాడ, గుంటూరు నగరాల్లో అనేక కాలనీలు వర్షపు నీటిలోనే నానుతున్నాయి. అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి వర్షపు నీరు చేరి.. కనీసం కాలు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. ఇక విజయవాడలోని బుడమేరు వాగు పొంగటంతో విజయవాడ ఔటర్ పరిధిలో ఉన్న రాయనపాడు రైల్వే స్టేషన్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో రైల్వే స్టేషన్ లో ఉన్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. ఆరవ బెటాలియన్ ఎస్డీఆర్ఎఫ్ రెస్కూ టీమ్ రంగంలోకి దిగి సహాయక చర్యలను చేపట్టింది. 2005లో చివరి సారి బుడమేరు బెజవాడ సిటీని ముంచెత్తింది. 2005 సెప్టెంబర్‌లో వచ్చిన భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైంది. విజయవాడ మూడొంతులు ముంపునకు గురైంది. వరదల కారణంగా విజయవాడలో కార్పొరేషన్‌ ఎన్నికలు సైతం వాయిదా పడ్డాయి. ఇక ఇప్పుడు కూడా అలాగే వరద పోటెత్తడం తో నగరంలోని ప్రధాన కాలనీ లు , రోడ్లు నీట మునిగాయి.

Read Also :  Ganesh Chaturthi 2024: వినాయకుడిని విగ్ర‌హం పెడుతున్నారా..? అయితే రూల్స్ ఇవే..!