Site icon HashtagU Telugu

CCTV Live Visuals : విజయవాడ సింగ్ నగర్లో వరద సృష్టించిన భీభత్సం

Singh Nagar Flood

Singh Nagar Flood

Flood Created Terror in Vijayawada Singh Nagar : పది రోజుల క్రితం ఎడతెరపిలేని వర్షం విజయవాడ (Vijayawada ) నగరాన్ని జలమయం చేసిన సంగతి తెలిసిందే. రికార్డు స్థాయిలో ఒకే రోజు 29 సెం,మీ వర్షం పడేసరికి వన్​టౌన్​, గురునానక్​ కాలనీ, చుట్టుగుంట, కృష్ణలంక, రామలింగేశ్వరనగర్​లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. బందర్​ రోడ్డు, ఏలూరు రోడ్డు సహా బెంజ్​ సర్కిల్​ తదితర ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. నిర్మలా కాన్వెంట్​ ప్రాంతం చెరువును తలపించింది.

అలాగే ఏపీఐఐసీ కాలనీ రోడ్డు , మొగల్రాజపురంలో పాలి క్లినిక్​ రోడ్డు , పాతబస్తీ పంజా సెంటర్​లో మినార్​ మసీదు, సింగ్​నగర్​లో ఇళ్లు ఇలా అన్ని ప్రాంతాలు మనిగాయి. ప్రధానంగా బుడమేరు కన్నెర్ర చెయ్యడం తోనే ఈ కాలనీ లు అన్ని నీట మునిగాయి. అటు కృష్ణమ్మ ఉగ్ర రూపం… ఇటు బుడమేరు కన్నెర్రతో బెజవాడ బెంబేలెత్తింది. ముఖ్యంగా సింగ్​నగర్​లో ప్రాణ , ఆస్తినష్టం ఎక్కువగా జరిగింది.

కాగా సెప్టెంబర్ 01 ఉదయం 09 గంటలకు సింగ్ నగర్ (Singh Nagar ) లోకి వరద ప్రవాహం రావడం స్టార్ట్ అయ్యింది. మొదటిలో పెద్దగా ఎవ్వరు పట్టించుకోలేదు. ఆ తర్వాత అరగంట కు అరగంట కు వరద ఉదృతి పెరుగుతుండడం తో ప్రజలు బయటకు రావడం..మాట్లాడుకోవడం..ఇళ్ళనుండి బయటకు వెళ్లడం చేసారు. దీనికి సంబదించిన లైవ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూస్తుంటే అక్కడి వరద ఉదృతి ఎంత భయంకరంగా ఉందొ అర్ధం అవుతుంది. దాదాపు వారం రోజుల పాటు వరదలో సింగ్ నగర్ తో పాటు పలు ప్రాంతాలు ఉన్నాయి. గత పది రోజులుగా ప్రభుత్వం కూడా రేయి పగలు కష్టపడుతూ..బుడమేరు కు పడిన గండ్లు పూడ్చేసింది.

ఈరోజు సాయంత్రంలోపు పూర్తిగా పరిస్థితిని చక్కదిద్దాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధికారులను ఆదేశించారు. విజయవాడ కలెక్టరేట్‌లో సోమవారం అర్ధరాత్రి వరకూ ఆయన సమీక్ష నిర్వహించారు. వరదలపై యుద్ధం తుది దశకు వచ్చిందని.. పూర్తిగా చక్కదిద్దిన అనంతరం ఇతర పాలనా వ్యవహారాలపై దృష్టి పెట్టాలని సూచించారు. అటు, ఉత్తరాంధ్రలో భారీ వర్షాల దృష్ట్యా ఆయా ప్రాంతాల మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. క్షేత్రస్థాయిలో తిరిగి సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు తనకు నివేదిక సమర్పించాలని నిర్దేశించారు.

Read Also : Pro Kabaddi Schedule: ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ షెడ్యూల్ వ‌చ్చేసింది..!