Floating Bridge Broken : విశాఖ ఆర్కే బీచ్లో ప్రారంభించిన తెల్లారే తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి..

విశాఖ ఆర్కే బీచ్ (Vizag RK Beach)లో పెనుప్రమాదం తప్పింది. నిన్న ఆదివారం ఆర్కే బీచ్లో ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జి (Floating Bridge )..ఈరోజు సోమవారం తెగిపోయింది. దీంతో పర్యటకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్కే బీచ్ లో సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చే పర్యాటకుల కోసం.. సముద్రపు అలల తాకిడిని ఆస్వాదించేందుకు గాను ఫ్లోటింగ్ బ్రిడ్జి ని రాష్ట్ర ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ కలిసి ఆదివారం అట్టహాసంగా ప్రారంభించారు. కానీ ప్రారంభించిన […]

Published By: HashtagU Telugu Desk
Floating Bridge Broken In V

Floating Bridge Broken In V

విశాఖ ఆర్కే బీచ్ (Vizag RK Beach)లో పెనుప్రమాదం తప్పింది. నిన్న ఆదివారం ఆర్కే బీచ్లో ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జి (Floating Bridge )..ఈరోజు సోమవారం తెగిపోయింది. దీంతో పర్యటకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్కే బీచ్ లో సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చే పర్యాటకుల కోసం.. సముద్రపు అలల తాకిడిని ఆస్వాదించేందుకు గాను ఫ్లోటింగ్ బ్రిడ్జి ని రాష్ట్ర ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ కలిసి ఆదివారం అట్టహాసంగా ప్రారంభించారు. కానీ ప్రారంభించిన మరుసటి రోజే ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోవడం తో ఒక్కరోజు ముచ్చటగానే మిగిలిపోయింది.

We’re now on WhatsApp. Click to Join.

అలల తాకిడిని ప్రజలు ఆస్వాదించే ఉద్దేశంతో ప్రారంభించగా.. నిన్న రాత్రి భారీగా వచ్చిన అలల కారణంగా ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోయింది. దీంతో సోషల్ మీడియా వేదికగా జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ప్రారంభించిన ఒక్కరోజులోనే ఇలా తెగిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన రాత్రి జరగడంతో పెనుప్రమాదం తప్పిందని.. ఒక వేళ డే పూట జరిగితే.. దానిపై ఎవరైనా ఉన్న సమయంలో అలా జరిగితే ఎంత ప్రాణ నష్టం జరిగిదేని ప్రజలు మండిపడుతున్నారు. ప్రజల ప్రాణాలకన్నా..పబ్లిసిటీ..ఎన్నికల్లో గెలవడమే ముఖ్యమని వైసీపీ ఫై విరుచుకపడుతున్నారు.

Read Also : B K Parthasarathi : పెనుకొండ మాజీ ఎమ్మెల్యేకు ఎంపీ టికెట్ ఆఫర్ ఇచ్చిన బాబు..?

  Last Updated: 26 Feb 2024, 08:13 PM IST