ప్లాస్టిక్ ప్లెక్సీలపై నిషేధం అమలు జనవరికి 26 కి వాయిదా పడింది. ఈ రోజు(నవంబర్ 1) నుంచి అమలు కావాల్సిన నిషేధం జనవరికి వాయిదా పడింది. సాంకేతిక పరిజ్ఞానం, తయారీ సామగ్రిని మార్చుకునేందుకు, సమకూర్చుకునేందుకు తగిన సమయం ఇవ్వాలంటూ ఫ్లెక్సీ తయారీదారుల ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తిని సీఎం జగన్ దృష్టికి అధికారులు తీసుకెళ్లారు.ఈ విషయంపై సీఎం జగన్ సానుకులంగా స్పందించి… ప్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం జనవరి 26 నుంచి అమల్లోకి తీసుకురావాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పరిజ్ఞానం విషయంలో వారికి తగిన విధంగా తోడుగా నిలవాలన్న సీఎం జగన్ అధికారులకు దిశానిర్ధేశం చేశారు. అలాగే సామగ్రిని మార్చుకునేందుకు అవసరం మేరకు రూ.20 లక్షల వరకు పావలా వడ్డీకే ఫ్లెక్సీ తయారీ దారులకు రుణాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తాజా నిర్ణయంతో ప్లాస్టిక్ ఫ్లెక్సీల రద్దు అమలు జనవరి 26 కి వాయిదా పడింది. పర్యావరణ హితంకోసం ప్లాస్టిక్ ఫ్లెక్సీలను రద్దుచేస్తూ ఇదివరకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాలుష్యాన్ని నివారించే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని ప్రకటించినట్లు ప్రభుత్వం పేర్కొంది.
Flex Ban In AP: ఏపీలో వాయిదా పడ్డ ప్లాస్టిక్ ప్లెక్సీలపై నిషేధం అమలు

Jagan Imresizer