తిరుపతి నగరంలో ఐదు మంది విద్యార్థుల అదృశ్యం తీవ్ర కలకలం రేపుతుంది. అన్నమయ్య స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న మోహత, మౌనశ్రీ, గునశ్రీ సహా మరో ఇద్దరు బాలురు మిస్ అయ్యారు. ఉదయం 6 గంటలకు స్టడీ అవర్స్ కోసం వెళ్లిన విద్యార్థులు తిరిగి ఇంటికి రాకపోవడంపై తల్లితండ్రులు ఆందోళన చెందారు. పిల్లల కోసం తలితండ్రులు పలు చోట్ల వెతికారు. పిల్లలు కనిపించకపోవడంతో పిల్లల పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Missing: తిరుపతిలో ఐదుగురు విద్యార్థులు మిస్సింగ్..!

Cropped (5)