Fish Tunnel : సొరంగంలో 200 జాతుల సముద్ర చేపలు

Fish Tunnel : విజయవాడలోని ఫిష్ టన్నెల్ ఎగ్జిబిషన్ పిల్లలు, పెద్దలు అందరినీ ఆకట్టుకుంటోంది.

Published By: HashtagU Telugu Desk
Fish Tunnel

Fish Tunnel

Fish Tunnel : విజయవాడలోని ఫిష్ టన్నెల్ ఎగ్జిబిషన్ పిల్లలు, పెద్దలు అందరినీ ఆకట్టుకుంటోంది. శాతవాహన కళాశాల గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఈ టన్నెల్ లో ఉన్న  వివిధ రకాల చేపలను చూసేందుకు పెద్ద ఎత్తున పట్టణ ప్రజలు తరలివస్తున్నారు. అక్టోబరు మూడోవారంలో మొదలుకానున్న దసరా సెలవుల్లో ఫిష్ టన్నెల్ కు పబ్లిక్ రష్ మరింతగా పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. సముద్రంలో నివసించే అరుదైన 200 జాతుల చేపలను ఈ ఫిష్ టన్నెల్ లో ప్రదర్శనకు ఉంచారు. దీని సందర్శనకు వచ్చేవారు కుటుంబ సభ్యులతో కలిసి అందమైన ఫోటోలను దిగడానికి ఫోటో గ్యాలరీలను కూడా ఏర్పాటు చేశారు.

We’re now on WhatsApp. Click to Join

ఆడవారికి, మగవారికి కావాల్సిన వస్త్ర దుకాణాలను కూడా ఏర్పాటు చేశారు. పిల్లలు సరదాగా ఆడుకోవడానికి షూటింగ్, బాల్ త్రో ఆటలను ఏర్పాటు చేశారు. కొలంబస్, జైంట్ వీల్, చైనా ట్రైన్, మ్యూజికల్ చైర్స్ వంటి ఎన్నో రకాల విహార ఏర్పాట్లను చేశారు. పిల్లల కోసం బౌన్సి కేస్సల్, బైక్ , బంగి జంప్, హెలికాప్టర్ వంటివి ఏర్పాటు చేశారు. ఈ ఫిష్ టన్నెల్ ఎగ్జిబిషన్ సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఈ నెలలో దీపావళి పండుగ దాకా ఫిష్ టన్నెల్ ఎగ్జిబిషన్ (Fish Tunnel) కొనసాగుతుందని అంటున్నారు.

Also read : Kanyakumari : మూడు సముద్రాల కలయిక కన్యాకుమారి.

  Last Updated: 03 Oct 2023, 08:07 AM IST