1st Day Chandrababu CID Interrogation : ఫస్ట్ డే చంద్రబాబు ను 60 ప్రశ్నలు వేసిన CID ..

మొదటి రోజు మొత్తం 60 ప్రశ్నలను CID అధికారులు చంద్రబాబు ను ప్రశ్నించినట్లు తెలుస్తుంది. ఉదయం 10 గంటల నుంచి 1 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ సాగింది

  • Written By:
  • Publish Date - September 23, 2023 / 06:32 PM IST

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో భాగంగా చంద్రబాబును ఈరోజు CID కస్టడీ తీసుకుంది. ఉదయం నుండి ఆయన్ను విచారించారు. మొదటి రోజు మొత్తం 60 ప్రశ్నలను CID అధికారులు చంద్రబాబు (Chandrababu) ను ప్రశ్నించినట్లు తెలుస్తుంది. ఉదయం 10 గంటల నుంచి 1 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ సాగింది. 12 మంది CID అధికారులు చంద్రబాబును విడతల వారీగా విచారించారు. ఒక సీఐడీ డీఎస్పీ ఇద్దరు సిఐలతో కలిసి మూడు మూడు గ్రూపులుగా విచారణ చేసినట్లు సమాచారం.

ఈ కేసులో మొత్తం చంద్రబాబును 120 ప్రశ్నలు అడగాలని ప్రిపేర్ అయ్యారు. తొలి రోజు 60 ప్రశ్నల వరకూ అడిగినట్లు తెలుస్తుంది. సిమెన్స్ కంపెనీ మాజీ ఎండి, డిజన్ టెక్ కు సంబంధించిన వివరాలు, అదే విధంగా షెల్ కంపెనీల కు సంబంధించిన లావాదేవీల పై సీఐడీ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో కిలారి రాజేష్,చంద్రబాబు పి.ఎ,శ్రీనివాస్, నారా లోకేష్ కు సంబంధించి వివరాల సేకరణే లక్ష్యంగా సీఐడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారని సమాచారం. చంద్రబాబు చెప్పిన సమాధానాలను సీఐడీ అధికారులు రికార్డు చేశారు. చంద్రబాబు విచారణ రేపు కూడా కొనసాగనుంది. ఒక వేళ చంద్రబాబు చెప్పిన సమాధానాలతో సీఐడీ అధికారులు సంతృప్తి చెందకపోతే మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.

Read Also : Rats Killed Baby : నెలల పసికందుపై ఎలుకలు దాడి.. చిన్నారి మృతి..!

మరోపక్క సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేశారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో పిటిషన్ కాపీని చంద్రబాబు తరపు లాయర్లు అందజేశారు. సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.