First Covid Positive Case : ఏపీలో తొలి కోవిడ్ పాజిటివ్‌ కేసు న‌మోదు

రెండు సంవత్సరాల విరామం తర్వాత ఏపీలో తొలి క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదైంది. ఏలూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి

  • Written By:
  • Publish Date - December 23, 2023 / 07:44 AM IST

రెండు సంవత్సరాల విరామం తర్వాత ఏపీలో తొలి క‌రోనా పాజిటివ్ కేసు న‌మోదైంది. ఏలూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడికి క‌రోనా పరీక్షలు చేయడంతో పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. దీంతో ఏపీలో మొదటి కోవిడ్ -19 కేసును నమోదైంది. జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలతో ఆరుగురిని ఆస్పత్రిలో చేర్చారు. వారి రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారు. వీరిలో ఓ ప్ర‌వేట్ ఆసుప‌త్రి వైద్యుడు ఉన్నార‌ని ఏలూరు జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ S. శర్మిష్ట తెలిపారు. వైద్యుడిని ఐసోలేషన్‌లో ఉంచారు. అతని నలుగురు కుటుంబ సభ్యుల రక్త నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపారని తెలిపారు. ఆ టెస్ట్‌ల రిజ‌ల్ట్ ఇంకా రావాల్సి ఉంది. కరోనా వ్యాక్సిన్‌ వేసిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ శర్మిష్ట తెలిపారు. కానీ వారు తమ ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలని.. కోవిడ్-19 ప్రోటోకాల్‌లను అనుసరించాలని కోరారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు వంటి అన్ని వైద్య పరికరాలు, మందులు సిద్ధంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) ఆస్పత్రుల జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్.పాల్ సతీష్ కుమార్ తెలిపారు. ఎవరైనా రోగికి కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే, ఆ వ్యక్తిని ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చేర్చుతారని డాక్టర్ సతీష్ కుమార్ తెలిపారు.

Also Read:  TDP : టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో రెండో రోజు చండీయాగం, సుదర్శన నారసింహ హోమం