ఏపీ పోలీసులు బాణాసంచా దుకాణాలకు సంబంధించిన నిబంధనలను విడుదల చేశారు. దీపావళి పండుగ సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేసేందుకు రాష్ట్ర పోలీసులు పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలకు మార్గదర్శకాలు జారీ చేశారు. దీపావళి రోజున సాయంత్రం 5 గంటల తర్వాత అమ్మకాలు నిలిపివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బాణాసంచా విక్రయించే దుకాణదారులతో సమావేశాలు నిర్వహించినట్లు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. నివాస ప్రాంతాలలో, సమీపంలోని ఇళ్లు, దుకాణాలు, గోదాముల్లో అనుమతి లేకుండా పటాకులు నిల్వ చేసినా, లైసెన్స్ లేకుండా అనధికారికంగా విక్రయాలు జరిపినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గోదావరి జిల్లాలో విజిలెన్స్ కోసం ప్రత్యేక పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేశారు. తయారీ యూనిట్లు, స్టోరేజీ గోడౌన్లు, క్రాకర్ల తయారీకి ముడి పదార్థాలను ఉంచే ప్రదేశాలలో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
పటాకుల్లో ఉపయోగించే పౌడర్‌ను నిల్వ చేసేందుకు ఇప్పటి వరకు 239 లైసెన్స్‌లు జారీ చేశామని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా 3856 దుకాణాలకు విక్రయాలు చేసేందుకు లైసెన్సులు మంజూరయ్యాయని.. నిబంధనలు అతిక్రమించిన లైసెన్సుదారులపై మూడు కేసులు (కాకినాడలో 2, నంద్యాలలో 1) నమోదయ్యాయని వెల్లబడించారు. రాష్ట్రవ్యాప్తంగా 44 ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్రమ నిల్వలు, తయారీ, విక్రయాలపై 60 కేసులు నమోదు చేశామని డీజీపీ తెలిపారు.
Also Read: BJP Manifesto: దీపావళి తర్వాత బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో