Chandrababu : చంద్రబాబు ఇంటి వద్ద భారీ అగ్నిప్రమాదం

మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఇంటి వద్ద అగ్నిప్రమాదం (Fire Accident) చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా..? లేక కుట్ర కోణం వుందా అన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఉండవల్లిలోని కృష్ణానది కరకట్ట పక్కన ఉన్న చంద్రబాబు ఇంటి సమీపంలోని తాటి చెట్లకు నిప్పు అంటుకుంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి చుట్టపక్కల ప్రాంతాలకు వ్యాపించాయి. పెద్ద ఎత్తున పొగలు […]

Published By: HashtagU Telugu Desk
Babu Fire Accident

Babu Fire Accident

మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఇంటి వద్ద అగ్నిప్రమాదం (Fire Accident) చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా..? లేక కుట్ర కోణం వుందా అన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఉండవల్లిలోని కృష్ణానది కరకట్ట పక్కన ఉన్న చంద్రబాబు ఇంటి సమీపంలోని తాటి చెట్లకు నిప్పు అంటుకుంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి చుట్టపక్కల ప్రాంతాలకు వ్యాపించాయి. పెద్ద ఎత్తున పొగలు అలుముకోవడంతో అక్కడ ఉన్న పోలీసులు పరుగులు పెట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

చంద్రబాబు ఇంటి పరిసర ప్రాంతాలు హైసెక్యూరిటీ జోన్ కావడంతో అక్కడ 24 గంటలు పోలీసులు పహరా కాస్తూ ఉంటారు. మంటలు వ్యాపించడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకోగా.. సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో స్థానికులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే చంద్రబాబు నివాసం వద్ద గతంలోనూ అగ్నిప్రమాదం సంభవించింది. ఎండుగడ్డికి నిప్పు అంటుకున్న పొలాల్లో మంటలు వ్యాపించాయి. భద్రతా సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేశారు.

Read Also : Supreme Court : ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ రద్దు – సుప్రీం తీర్పు వెల్లడి

  Last Updated: 15 Feb 2024, 12:08 PM IST