Apsara Theatre: జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల అత్యుత్సాహం.. విజయవాడలోని అప్సర థియేటర్ లో మంటలు.. వీడియో వైరల్..!

విజయవాడలోని అప్సర థియేటర్ (Apsara Theatre)లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల అత్యుత్సాహం అగ్ని ప్రమాదానికి కారణమైంది.

Published By: HashtagU Telugu Desk
Apsara Theatre

Resizeimagesize (1280 X 720) (1)

Apsara Theatre: విజయవాడలోని అప్సర థియేటర్ (Apsara Theatre)లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల అత్యుత్సాహం అగ్ని ప్రమాదానికి కారణమైంది. జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) పుట్టిన రోజు సందర్భంగా శనివారం ఆయన నటించిన సింహాద్రి సినిమాను రీ రిలీజ్ విడుదల చేశారు. మొదటి ఆట ప్రారంభమైన తర్వాత అభిమానులు థియేటర్ లో సందడి చేశారు. రంగు రంగుల పొగలు వెదజల్లే బాణసంచా కాల్చారు. దీంతో థియేటర్లో పొగలు కమ్ముకున్నాయి. ఈ లోగా మరికొందరు అభిమానులు చిచ్చుబుడ్డి వెలిగించటంతో ఒక్కసారిగా మంటలు రేగాయి.

సీట్లకు నిప్పు అంటుకోవటంతో అంతా ఉలిక్కిపాటుకు గురయ్యారు. యాజమాన్యం హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పివేశారు. మూడు సీట్లు మాత్రమే కాలటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న గవర్నర్ పేట పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. శనివారం సాయంత్రం 6:15 గంటలకు అప్సర థియేటర్‌లో సింహాద్రి సినిమా ప్రదర్శనలో ఈ మంటలు చెలరేగాయి.

Also Read: Stadium Stampede : 12 మంది మృతి..స్టేడియంలో తొక్కిసలాట

థియేటర్ ముందు సీట్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదం కారణంగా అప్సర థియేటర్ యాజమాన్యం సినిమా 6, 9:30 షోలను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో సింహాద్రి సినిమా చూసేందుకు వచ్చిన అభిమానులు సినిమా ప్రదర్శన రద్దుపై అసంతృప్తితో థియేటర్ నుంచి వెనుతిరిగారు.

  Last Updated: 21 May 2023, 02:12 PM IST