Site icon HashtagU Telugu

Fire Breaks : విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం

Fire Accident Vizag Railway

Fire Accident Vizag Railway

విశాఖ రైల్వేస్టేషన్లో (Visakhapatnam Railway Station) భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఆగి ఉన్న రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన తో ప్రయాణికులంతా భయబ్రాంతులకు గురై పరుగులు పెట్టారు. నాలుగో నంబర్‌ ప్లాట్‌ ఫారంపై నిలిపి ఉన్న కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్(Korba – Visakha Express)​లోని ఏసీ బోగీల్లో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ఈ ప్రమాదంలో బీ-6, బీ-7, ఎం-1 బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ట్రై చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఘటనకు సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. కోర్బా రైలు ఉదయం 6 గం.కు కోర్బా నుంచి విశాఖకు చేరుకుంది. మధ్యాహ్నం 2 గం.కు తిరుపతి వెళ్లాల్సి ఉండగా షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం జరిగిఉండొచ్చని రైల్వే సిబ్బంది భావిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో ప్రయాణికులెవరూ రైలులో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలతో పాటు పొగ దట్టంగా అలుముకోవడంతో స్టేషన్లోని ప్రయాణికులు భయంతో బయటకు పరుగులు తీశారు. రైలులో అగ్ని ప్రమాద ఘటనపై హోంమంత్రి అనిత డీఆర్‌ఎంతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాదానికి సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం లేదని విశాఖ సంయుక్త సీపీ ఫకీరప్ప చెప్పారు. రైలులో నుంచి ప్రయాణికులందరూ దిగిపోయారని తెలిపారు. ఈరోజు ఉదయం 10 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.

Read Also : Independence Day 2024 : ఆగస్టు 9 నుంచి 15 వరకు ‘హర్ ఘర్ తిరంగా’