Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు..

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పుష్కరాల కు ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయించింది. తాజాగా రైల్వే శాఖ గోదావరి పరీవాహక రైల్వే స్టేషన్లలో సౌకర్యాల కోసం నిధులు ప్రకటించింది.

Published By: HashtagU Telugu Desk
Finalized Muhurat For Godavari Pushkaralu

Finalized Muhurat For Godavari Pushkaralu

Godavari Pushkaralu : కోట్లాది మంది పవిత్రంగా భావించే గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాల నిర్వహణకు నిర్ణయించారు. ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి జరిగే పుష్కరాల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు మొదలు పెట్టింది. దీంతో, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పుష్కరాల కు ప్రాధాన్యత ఇస్తూ నిధులు కేటాయించింది. తాజాగా రైల్వే శాఖ గోదావరి పరీవాహక రైల్వే స్టేషన్లలో సౌకర్యాల కోసం నిధులు ప్రకటించింది. ముందస్తు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. పుష్కరాల కోసం వచ్చే భక్తుల కోసం పలు నిర్ణయాలు తీసుకున్నారు.

గోదావరి పుష్కరాలకు దేశ విదేశాల నుంచి గోదావరి పుష్కరాలకు తరలి రానున్నారు. ఈ సారి పుష్కరాల కోసం 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో ప్రతిపాదలు అధికార యంత్రాంగం సిద్దం చేసింది. అఖండ గోదావరి పుష్కరాలు-2027 ముసాయిదా యాక్షన్‌ ప్లాన్‌ కూడా సిద్ధమైంది. అందరూ ఒకే ఘాట్‌లో స్నానాలు చేసే అవసరం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేయొచ్చని ప్రచారం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న 17 ఘాట్లకు రోజుకు 75,11,616 మంది వస్తారని అంచనా వేస్తున్నారు.

కేంద్రం ముందస్తుగానే గోదావరి పుష్కరాల కోసం నిధులు కేటాయించింది. ఇప్పటికే రూ 100 కోట్ల ను పుష్కరాల కోసం ప్రకటించారు. తాజాగా రైల్వే శాఖ పుష్కరాల కు వచ్చే భక్తుల సౌకర్యాల కల్పన కోసం రాజమండ్రి రైల్వే స్టేషన్ కు రూ 271.43 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రధాన ప్రాంతాల నుంచి రాజమండ్రికి ప్రత్యేక రైళ్లు నడుపుతామని.. ముందస్తుగానే ఖరారు చేస్తామని అధికారులు వెల్లడించారు. కాగా, త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో గోదావరి పుష్కరాల పైన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి కార్యాచరణ ఖరారు చేయనున్నారు.

Read Also: Kobali Web Series : పవన్ చేయాల్సిన మూవీ లో యాంకర్ శ్యామల..!

 

 

  Last Updated: 24 Jan 2025, 04:15 PM IST